Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: కనీసం ముద్దు కూడా పెట్టలేని స్థితి

By:  Tupaki Desk   |   24 Feb 2020 7:30 PM GMT
కరోనా ఎఫెక్ట్: కనీసం ముద్దు కూడా పెట్టలేని స్థితి
X
కరోనా వైరస్. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ అంటువ్యాధి గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే 70 వేల మందికిపైగా సోకింది. 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలో మరణ మృందంగం వాయిస్తోంది.

ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమాని సరిగ్గా సంసారాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఎదురవుతోందట.. ఇళ్లనుంచి బయటకు రాకుండా కనీసం ప్రియురాలికి ముద్దు పెట్టడానికి కూడా వీలు లేని పరిస్థితి ఎదురైంది.

చైనా సహా విదేశాల్లో ముద్దులు, హగ్గులు కామన్. కనిపించగానే ముందు మూతులు మూతులు రాసుకుంటారు. కానీ తాజాగా కరోనా ఎఫెక్ట్ తో చైనా పక్కనే ఉండే ఫిలిప్పెన్స్ సముద్ర తీరంలోని బాకొలాడ్ నగరంలో పెళ్లి జంటలకు ఎంతో కష్టం వచ్చింది. అక్కడి ప్రభుత్వం తాజాగా 220 జంటలకు గ్రాండ్ గా పెళ్లి చేసింది. పెళ్లికొడుకు - పెళ్లి కూతుళ్లు తెల్లటి దుస్తుల్లో మెరిసిపోయారు. కానీ అంతమంది ముఖాలకు మాస్కులతో పెళ్లి పీటలమీదకు వచ్చారు. పెళ్లి అయ్యాక ముద్దులు పెట్టుకోవడం కామన్. అప్పుడు కూడా మాస్కుల మీదనుంచే పెట్టుకున్నారు.

ఇలా ఎందుకు పెట్టుకున్నారంటే కరోనా భయం. కరోనా వైరస్ ఫిలిప్పీన్స్ లో ప్రబలడంతో కొత్త పెళ్లి జంటలు ఇలా ముఖానికి మాస్కులతో పెళ్లి చేసుకోవడం.. ముద్దులు కూడా మాస్కుల మీదనే పెట్టుకోవడం ఆ పిక్స్ వైరల్ కావడం జరిగిపోయింది.