Begin typing your search above and press return to search.

మతం ముసుగులో కోట్లు కొల్లగొట్టి.. కరోనాతో చచ్చి..

By:  Tupaki Desk   |   20 Sep 2020 6:15 AM GMT
మతం ముసుగులో కోట్లు కొల్లగొట్టి.. కరోనాతో చచ్చి..
X
కొన్ని కేసులు అంతుబట్టకుండా ఉంటాయి. వందల కోట్లు మతం ముసుగులో వసూలు చేసిన వ్యక్తి చివరకు కరోనాతో చనిపోయాడు. ఆ కోట్లు ఎక్కడ పెట్టాడు? ఏం చేశాడన్నది సొంత కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. దీంతో ఇచ్చిన వారు.. అతడికి వసూలు చేసిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

కాకినాడకు చెందిన ఓ వ్యక్తి మతం ముసుగులో మల్టీలెవల్ మార్కెటింగ్ కు దిగాడు. కోట్ల రూపాయలు సేకించాడు. చివరకు కరోనాతో మరణించడంతో ఆ డబ్బులు కట్టిన వారు అయోమయంలో పడ్డారు. ట్విస్ట్ ఏంటంటే ఆ డబ్బులను అతడు ఏం చేశాడు? ఎక్కడ పెట్టాడన్నది సొంత కుటుంబ సభ్యులకు కూడా తెలుపలేదు.

కాకినాడకు చెందిన ఓ వ్యక్తి క్రైస్తవ మతం కష్టాలలో ఉందని.. దానిని రక్షించాలంటూ ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటూ ప్రచారం ప్రారంభించాడు. కేంద్ర ప్రభుత్వం క్రైస్తవ నిధులను అడ్డుకుంటోందని.. క్రైస్తవులకు, పాస్లర్లకు నమ్మకం కలిగేలా చేశాడు.

రాష్ట్రపతి భవన్ ను కట్టించి బ్రిటీష్ క్రైస్తవులని.. అది మన సొంతమని.. దాని ద్వారా వేల కోట్ల రూపాయలు వస్తాయని.. క్రైస్తవ సమాజ ఉద్దరణ చేస్తామంటూ నమ్మించాడు.

అలా క్రైస్తవ కౌన్సిల్ నుంచి నిధులు రావాలంటే ముందుగా కమీషన్ చెల్లించాలంటూ అందరినీ నమ్మించాడు.

ఈ క్రమంలోనే రూ.37500 కడితే రూ.కోటి ఇప్పిస్తానంటూ మల్టీ లెవల్ మార్కెటింగ్ నడిపించాడు. అతడిని నమ్మి డబ్బులను క్రైస్తవులు భారీగా కట్టారు. చాలా మంది ఇతరుల చేత కూడా డబ్బులు కట్టించారు.

తాజాగా ఆ వ్యక్తి కోట్లు వసూలు చేసి తాజాగా కరోనాతో చనిపోయాడు. దీంతో కాకినాడలోని వాళ్ల ఇంటికి వెళ్లి ఆరాతీయగా.. మాకు అసలు ఆ విషయం తెలియదని కుటుంబ సభ్యులు అనడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు.