Begin typing your search above and press return to search.
ఢిల్లీలో వంద మంది రైతుల అదృశ్యం.. ఎటుపోయారు?
By: Tupaki Desk | 30 Jan 2021 2:53 PM GMTమోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనపై దేశవ్యాప్తంగా చర్చసాగుతున్న తరుణంలో మరో అంశం కలకలం రేపుతోంది. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఘటన తర్వాత.. రైతులు పెద్ద ఎత్తున కనిపించకుండా పోయారనే విషయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మేరకు పంజాబ్ హూమన్ రైట్స్ సంస్థ శనివారం చేసిన ఓ ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది.
పంజాబ్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చేసిన ప్రకటన ప్రకారం.. జనవరి 26 తర్వాత రాష్ట్రానికి చెందిన చాలామంది రైతు నిరసన కారులు అదృశ్యమయ్యారు. ఢిల్లీ హింసలో పాల్గొన్న దాదాపు 100 మంది రైతులు నాలుగు రోజులుగా కనిపించడంలేదట. ఈ ప్రకటనతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ మేరకు పంజాబ్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 12 మంది రైతులు కూడా కనిపించకుండా పోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ కేసు కూడా నమోదైందట. ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘం తన రిపోర్టులో పేర్కొంది. ముఖ్యంగా ఎర్రకోటపై జెండా ఎగరేసిన వారే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారని వివరించింది. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న 200 మంది రైతులపై కేంద్ర ప్రభుత్వం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
పలువురు రైతులపై దేశద్రోహం కేసు కూడా నమోదు చేసింది. అయితే.. కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సేవలను అందించాలని పలు సంఘాలకు చెందిన నాయకులు నిర్ణయించారు. ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న వారి తరఫున ఉచితంగా వాదనలు వినిపిస్తామని వారు ప్రకటించారు.