Begin typing your search above and press return to search.

100 మంది పిల్లల్ని కాల్చేసిన పాక్ సైన్యం

By:  Tupaki Desk   |   5 Oct 2015 4:38 AM GMT
100 మంది పిల్లల్ని కాల్చేసిన పాక్ సైన్యం
X
ఉగ్రవాదుల కంటే ఘోరంగా.. దారుణంగా వ్యవహరించారు పాక్ సైనికులు. అంతర్జాతీయంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న ఈ ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. పాక్ కు చెందిన బెలూచిస్తాన్ లో ఈ ఘోరం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని భాగమైన బెలుచిస్తాన్ (ఇప్పటికి) స్వతంత్రంగా ఉండాలని పోరాటం చేస్తోంది.

తమ ఆకాంక్షను బయటకు వ్యక్తం చేయటంతో పాటు.. పాక్ సర్కారు మీద పోరాటం చేస్తున్నారు అక్కడి ప్రజలు. తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. వాస్తవానికి 1947 దేశ విభజన నాటికి బెలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. అయితే.. 1948 ఏప్రిల్ తర్వాత ఈ ప్రాంతాన్ని పాక్ బలవంతంగా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలని అక్కడి ప్రజలు పోరాడుతున్నారు.

బెలూచిస్తాన్ లో చోటు చేసుకుంటున్న ఆందోళనల్ని కర్కసంగా అణిచి వేసేందుకు పాక్ సైనికులు ఆరాచకాలు సృష్టిస్తున్నారు. మానవ హక్కుల్ని తీవ్రంగా హరిస్తూ.. అక్కడి ఉద్యమ నాయకులు.. ఇతరులకు చెందిన వంద మంది ముక్కపచ్చలారని చిన్నారుల్ని అత్యంత దారుణంగా కాల్చేశారు. దీంతో బెలూచిస్తాన్ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమ రాజ్యాన్ని ఆక్రమించుకోవటమే కాదు.. తమ పిల్లల్ని అంత దారుణంగా చంపేస్తారా అంటూ పాక్ సైన్యంపై మండి పడుతున్నారు అక్కడి ప్రజలు. నిత్యం కాశ్శీర్ గురించి మాట్లాడే పాక్.. మొదట బెలూచిస్తాన్ గురించి.. అక్కడి ప్రజల హక్కుల గురించి ఆలోచిస్తే బాగుంటుందేమో.