Begin typing your search above and press return to search.
హాలీవుడ్ సినిమాల్లో కనిపించే సీన్..థాయ్ లాండ్ రోడ్ల మీద
By: Tupaki Desk | 15 March 2020 1:30 AM GMTకరోనా పిశాచి తన పరిధిని అంతకంతకూ విస్తరిస్తోంది. మొన్నటివరకూ కరోనా వైరస్ ఫేజ్ వన్ మాత్రమే చూసిన ప్రపంచానికి.. ఇప్పుడు ఫేజ్ టూలోకి వెళ్లిపోయిన వైనం అర్థమవుతోంది. క్యాలెండర్లో రోజు మారే కొద్దీ.. ఈ వైరస్ ప్రభావం అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. దీని కారణంగా ప్రభావానికి లోనుకాని రంగం అంటూ ఏమీ లేదన్నట్లుగా పరిస్థితి మారింది. పారిశ్రామికంగా.. ఆర్థికంగా.. పర్యాటకంగా పలు దేశాలు విలవిలలాడిపోతున్న దుస్థితి.
తాజాగా ప్రముఖ పర్యాటక దేశంగా చెప్పే థాయ్ లాండ్ లో పరిస్థితి చూస్తే గుండెలు అదరిపోవటం ఖాయం. ఏదైనా విపత్తు విరుచుకుపడటం.. దీంతో ప్రముఖ దేశాల్లో పెను విలయం.. విధ్వంసం లాంటి సీన్లు హాలీవుడ్ సినిమాల్లో తరచూ కనిపించేవే. కానీ.. థాయ్ రోడ్ల మీద ఇప్పుడు కనిపిస్తున్న సీన్లు మాత్రమ ఇప్పటివరకూ ఏ సినిమాల్లో కనిపించి ఉండవంటున్నారు.
కరోనా కారణంగా థాయ్ దేశం వైపు పర్యాటకులు కన్నెత్తి చూడటం లేదు. దీంతో.. అక్కడి టూరిజం దెబ్బ పడటమే కాదు.. దాని కారణంగా మూగజీవాలకు తిండి పెద్ద సమస్యగా మారింది. మొన్నటివరకూ టూరిస్టులు వచ్చి.. కోతులకు ఆహారం వేయటంతో శ్రమ లేని పరిస్థితి. కరోనాతో సీన్ మారిపోవటం.. పర్యాటకులు ఎవరూ లేకపోవటంతో కోతులకు తిండి పెట్టే నాథుడే లేకుండా పోయాడు. దీంతో.. చెట్ల మీద నుంచి రోడ్ల మీదకు రావటమే కాదు.. ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో వేలాదిగా కోతులు ఆహారం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉన్నాయి.
కోతుల మందలో ఏదైనా కోతికి కాస్తంత ఆహారం దొరికినంతనే.. దాన్ని లాక్కునేందుకు మిగిలిన కోతులన్ని దాని మీదకు దాడికి దిగటంలాంటి భీతావాహ సీన్లకు సంబంధించిన చిట్టి వీడియో ఒకటి వైరల్ గా మారింది. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురైతే.. కోతుల నుంచి థాయ్ ప్రజలకు పెను ముప్పు ముంచి ఉందా? అన్న సందేహం కలుగుక మానదు. కంటికి కనిపించని వైరస్.. ఎంతటి విలయాన్ని క్రియేట్ చేస్తుందన్నది ఈ వీడియో చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది.