Begin typing your search above and press return to search.
హంగ్ లో కింగ్: గవర్నర్ ఎవరో తెలుసా?
By: Tupaki Desk | 16 May 2018 4:29 AM GMTకాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సీనియర్లు గవర్నర్లుగా ఉంటారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉండడంతో బీజేపీలో పనిచేసిన కురు వృద్ధులే గవర్నర్లుగా ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ గా ఉన్న వజుభాయ్ వాలా ఎవరో తెలుసా.? ఈయన పక్కా గుజరాతీ.. అమిత్ షా, మోడీకి చాలా సన్నిహితుడు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన పక్కా హిందుత్వవాది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో హంగ్ ఏర్పడింది. ఆ రాష్ట్రంలో అధికారం ఎవరికి అప్పజెప్పాలన్న దానిపై పీటముడి నెలకొంది. మరి కర్ణాటక గవర్నర్ గా వజుభాయ్ బీజేపీని కాదని.. కాంగ్రెస్-జేడీఎస్ లకు అధికారం అప్పజెప్పుతారా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న..
ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే వారే రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేలా సెటప్ తయారైంది. నాడు కాంగ్రెస్ చేసింది. నేడు బీజేపీ చేసింది.. కర్ణాటక గవర్నర్ గా ఉన్న వ్యక్తి మోడీ, అమిత్ షాలతో కలిసి గతంలో గుజరాత్ లో పనిచేశారు. ఇప్పుడు వారిపట్ల కాస్త భయమో, భక్తితోనో ఉంటారు.. వజుభాయ్ కు అపార అనుభవం ఉంది. 2012 నుంచి 2014 దాకా గుజరాత్ స్పీకర్ గా పనిచేశాడు. ఎమర్జెన్సీ సమయంలో 11 నెలల పాటు బీజేపీ తరఫున పోరాడి జైలుకు వెళ్లొచ్చాడు. రెండు సార్లు గుజరాత్ ఆర్థికమంత్రిగా పనిచేశాడు. 2014లో మోడీ దయతో కర్ణాటక గవర్నర్ గా నియమించబడ్డాడు. ఇప్పుడు కర్ణాటక బంతి ఈయన చేతుల్లో ఉంది.
కర్ణాటకలో బీజేపీకి అధికారంలోకి రావడానికి మెజార్టీ తగ్గింది. కాంగ్రెస్-జేడీఎస్ లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కలిసిపోయాయి. ఇక్కడ గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారింది. మరి ఒకప్పుడు కరుడుగట్టిన బీజేపీ వాదిలా ఉన్న గవర్నర్ బీజేపీనే ఆహ్వానిస్తారా.? లేక మ్యాజిక్ ఫిగర్ ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ లను ఆహ్వానిస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. అన్ని రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు, గవర్నర్ నేపథ్యాన్ని చూస్తే కర్ణాటక కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. మరో రెండు మూడు రోజులు గడిస్తే కానీ పరిస్థితి అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.