Begin typing your search above and press return to search.

మోడీ నోట హంగ్ వద్దు.. ఏంటీ భయం..

By:  Tupaki Desk   |   31 Jan 2019 6:10 AM GMT
మోడీ నోట హంగ్ వద్దు.. ఏంటీ భయం..
X
పూర్తి స్థాయి మెజారిటీ కేంద్రంలో రాకపోతే దేశాభివృద్ధి ఆగిపోతుందని.. రాజకీయ అస్థిరత కారణంగా భారత్ తిరోగమనం దిశగా వెళుతుందని ప్రజలను భయపట్టేలా మోడీ ప్రసంగాలు చేస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని సూరత్ లో విమానాశ్రయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఓటర్లను బీజేపీకే ఓటు వేయాలని.. కాంగ్రెస్ కూటమిని గెలిపించవద్దంటూ విన్నపంతో కూడిన హెచ్చరికను చేశారు.

యువతరం 2014లో విజ్ఞతతో ఆలోచించి బీజేపీకి ఓట వేయడంతో భారత్ నేడు పురోగమిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. గత 30ఏళ్లలో ఏ పార్టీకి పూర్తిగా మెజార్టీ రాక సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటంతో దేశాభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. సంపూర్ణ మోజార్టీ ఉన్న ప్రభుత్వం ఉన్న కారణంగానే నోట్ల రద్దు - రియల్ ఎస్టేట్ సంస్థల్లో పేరుకపోయిన నల్ల ధనాన్ని వెలికితీయశామని అన్నారు. అదేవిధంగా ముద్ర పథకాన్ని తీసుకొచ్చామని - అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్ కోటా కల్పించేందుకు ధైర్యంగా ముందుకెళ్లగలిగామని ఆయన వివరించారు.

సూరత్ సభ తర్వాత మోడీ నవ్సరి జిల్లాలోని దండికి చేరుకున్నారు. అక్కడ గాంధీ వర్ధంతి వేడుకల్లో పాల్గొని జాతీయ ఉప్పు - సత్యగ్రహ స్మారకం - మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం సాధ్యమా? అని పలువురు అనుమానం వ్యక్తం చేశారని అన్నారు. కానీ గాంధీకి ఉప్పుకున్న శక్తి - సమాజంలో వేర్వేరు వర్గాలతో దానికున్న అనుబంధం తెలిసినందు వల్లే ధైర్యంగా ముందుకు సాగారని తెలిపారు. ఒకవేళ గాంధీ ప్రతికూల వ్యక్తుల ప్రభావానికి లోనై ఉద్యమాన్ని ఆపేసుంటే ఏం జరిగేదని ప్రశ్నించారు. మరుగుదొడ్లు కట్టడం వల్ల ఏం వస్తుంది? ఇది ప్రధాని చేసే పనేనా? గ్యాస్ కనెక్షన్లు సామాన్యుల జీవితాలను ఎలా బాగు చేస్తాయి? అంటూ కొందరు వేసిన ప్రశ్నలను ప్రజలు మరిచిపోలేదనన్నారు.

2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 9కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని మోడీ అన్నారు. ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్ - అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక కట్టడాలపై ఆయా దేశాల పౌరులు ఎన్నడూ విమర్శించలేదని కానీ దురదృష్టవశాత్తు కొందరు మనదేశంలో ఉన్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. వీరి మాటలను ప్రజలు కూడా పట్టించుకోవడంలేదని అన్నారు. ప్రజలకు దేశాభివృద్ధిని కోరుకుంటున్నారని.. అది జరుగాలంటే బీజేపీనే కేంద్రం రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ఏదిఏమైనా ప్రధాని హంగ్ ప్రాస్తవన గురించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. హంగ్ వస్తుందని ప్రధాని మోడీ, బీజేపీ నేతలు భయపడుతున్నారా? అనే సందేహాలు ఆయన మాటలను బట్టి కలుగుతున్నాయి.