Begin typing your search above and press return to search.
ఆకలితో అన్నీ అమ్ముకుంటున్న అఫ్గాన్లు .. కారణం ఇదే !
By: Tupaki Desk | 22 Sep 2021 5:51 AM GMTకాబుల్ నగరం కొత్త రూపు సంతరించుకోవడానికి సిద్ధమవుతోంది. ఆ రూపం కొత్త తాలిబాన్ నాయకుల సంకల్పం, ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. నగరంలోని అఫ్గానీల్లో ఎక్కువ మంది పేదలున్నారు. ఆకలి తీర్చుకోవడానికి సరిపడా డబ్బు సంపాదించుకోవడం ఇప్పుడు వారి ముందున్న అతి పెద్ద సవాల్. అఫ్గానిస్తాన్‌కు విదేశీ సాయంగా లక్షలాది డాలర్లు అందినా అక్కడి లక్షలాది మంది ప్రజలు మాత్రం కఠిక పేదరికంలో జీవిస్తున్నారు. అఫ్గాన్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో సుమారు 900 కోట్ల డాలర్లను తాలిబాన్ చేతికి వెళ్లకుండా అమెరికా స్తంభింపజేసింది.
ఈ డబ్బు వినియోగంలోకి వస్తే పేదలకు సహాయపడొచ్చు. కానీ, ఇప్పుడా నగరంలో పెద్ద భవన నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. బ్యాంకులు మూసివేశారు. విదేశీ డబ్బు వచ్చే మార్గాలు ఆగిపోయాయి. దేశంలో విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. ఇదిలా ఉంటే .. కాబుల్ లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలను పోషించుకోవడానికి లక్షలాది మంది కష్టపడుతున్నారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యుఎఫ్ పీ) అంచనా ప్రకారం అప్గాన్‌లో 93 శాతం మందికి తినడానికి తగినంత ఆహారం లభించడం లేదు. గత నెలలో తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లక ముందు ఇది 80 శాతంగా ఉండేది.
పాత అప్గానిస్తాన్ లో సంపదను కూడబెట్టుకోగలిగిన వ్యక్తులు ఆహారం కొనుక్కునేందుకు నగదు కోసం ఆస్తులను తక్కువ మొత్తానికే అమ్ముకుంటున్నారు. ఎక్కువగా ఆహారం కోసం విక్రయాలు జరగడంతో నగరం అంతటా మార్కెట్లు పుంజుకున్నాయి. విలువైన కార్పెట్ లు, టీవీల నుంచి కత్తిపీటల వరకు ఇళ్లలోని వస్తువులను ప్రజలు బండ్లపై సెకండ్ హ్యాండ్ మార్కెట్లకు తీసుకురావడం నేను చూశాను. ఒక వ్యక్తి రబ్బరు మొక్కను విక్రయిస్తున్నాడు. చాలామంది అమ్మడానికి వస్తున్నారు. కొద్ది మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నగదు లభ్యత తక్కువగా ఉండటంతో సెకండ్ హ్యాండ్ మార్కెట్లు కూడా స్తబ్దుగా ఉన్నాయి.
వ్యక్తిగత స్వేచ్ఛ, బాలికల విద్య, మహిళల పని చేసే హక్కులకు హరించడాన్ని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించింది. కానీ, ఆకలి సమస్యను తీర్చే అత్యవసర బాధ్యత మాత్రం ఆ దేశంపైనే ఉంది. అఫ్గాన్లకు సహాయం చేయాలనుకునే దేశాలు, తాలిబాన్లను తిరస్కరించాయి. దీంతో పెద్ద గందరగోళం ఎదురైంది. ప్రజలు పని చేసి డబ్బు సంపాదించడానికి, జీవించడానికి, తినడానికి, తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో ఆచరణీయమైన పాలన కొనసాగించాలి. తాలిబాన్లతో పోరాడిన అమెరికా, బ్రిటన్ సహా ఇతర దేశాలకు, ఈ పాత శత్రువుపై విజయం సాధించినట్లు అనిపించినా, ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోవడం కష్టమే. ప్రత్యామ్నాయం మరింత దారుణంగా ఉండవచ్చు. ప్రజలు మరిన్ని బాధలకు గురి కావొచ్చు. పోషకాహార లోపం ఉన్న పిల్లలు, శరణార్థులు సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. అఫ్గానిస్తాన్ మరోసారి విఫల దేశంగా మారొచ్చు. ఫలితంగా మళ్లీ అఫ్గాన్ గడ్డ జిహాదిస్టులకు అడ్డాగా మారే ప్రమాదం ఉంది.