Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ : ప్రజలకే కాదు.. మూగజీవాలకు కూడా కష్టాలే
By: Tupaki Desk | 29 Jun 2020 1:20 PM ISTఓవైపు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ప్రపంచ వ్యాప్తం ఈ వైరస్ భారిన పడిన వారి సంఖ్య కోటి దాటిపోయింది. అయిన కూడా ఈ వైరస్ కి ఇప్పటివరకు సరైన వ్యాక్సిన్ లేదు. అలాగే వ్యాధి వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ వైరస్ కారణంగా సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
థాయ్ లాండ్ లోని లోప్ బురిలో సాన ఫ్రా కాన, ఫ్రా ప్రాంగ్ సామ్ అనే పురాతన ఆలయాల ప్రాంగణంలో వేల కోతులు సందడి చేస్తుంటాయి. ఇక్కడి కోతులకు ఆహారం అందిస్తే సకల శుభాలు, ఐశ్వర్యం సిద్దిస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాకుండా ప్రతీ ఏడాది మంకీ బఫెట్ ఫెస్టివల్’అనే వినూత్న వేడుకను ఏర్పాటు చేసి అక్కడి కోతులకు పెద్ద మొత్తంలో ఆహారాన్ని అందిస్తారు. అయితే లాక్ డౌన్ తో సీన్ పూర్తిగా మారిపోయింది.
పూర్తి వివరాలు చూస్తే .. వైరస్ మహమ్మారి కారణంగా థాయ్ లాండ్ టూరిజం బాగా దెబ్బతింది. ఈ వైరస్ దెబ్బకు పర్యాటక రంగం భారీగా నష్టపోయింది. దీంతో లోప్ బురిలో నివసించే వేల కోతుల కష్టాలు అన్ని ఎన్ని కావు. పర్యాటకులు లేకపోవడంతో వీటికి ఆహార కొరత ఏర్పడింది. దీంతో రోడ్లపైకి వచ్చి ఆహారం కోసం వెతుకులాట ప్రారంభించాయి. అక్కడి ప్రజలపై, దుకాణాదారులపై ఆహారం కోసం దాడి చేస్తున్నాయి. కొంత మంది వీటి దయనీయ పరిస్థితిని గమనించి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కోతుల దయనీయ పరిస్థితి అద్దం పట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.