Begin typing your search above and press return to search.
తేడా కొట్టిందా.. కేసీఆర్ ఖేల్ ఖతమే..
By: Tupaki Desk | 28 Aug 2018 6:39 AM GMTఇప్పటివరకూ అంతా ప్లాన్డ్.. కానీ తేడా కొట్టిందా కేసీఆర్ ఖేల్ ఖతమే.. అవును ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న ముందస్తు ఎన్నికల ప్రక్రియ చేపట్టడానికి ఎన్నో చిక్కుముడులున్నాయి. ఎన్నికలకు ఇంకా 8 నెలలు మాత్రమే ఉన్నాయి. కేసీఆర్ ఇప్పుడే అసెంబ్లీ రద్దు చేస్తే 6 నెలలలోపే ఎన్నికలు నిర్వహించాలి. కేసీఆర్ టార్గెట్ కు.. సార్వత్రిక ఎన్నికల టార్గెట్ కు కేవలం రెండు నెలల గ్యాప్.. ఎక్కడ ఏదీ తేడా కొట్టినా కేసీఆర్ ప్లాన్ బెడిసికొట్టడం ఖాయం. అదే జరిగితే కేసీఆర్ ఆశించిన సీట్లు రావు.. ముఖ్యంగా ఎంపీ సీట్లలో భారీగా కోత పడే చాన్స్ ఉంది. ఎంపీ ఎన్నికలను జాతీయ కోణంలో చూసే ఓటర్లు టీఆర్ ఎస్ కు వేసినా లాభం ఉండదని మనసు మార్చుకునే చాన్స్ ఉంది. ఇదే ఇప్పుడు కేసీఆర్ లో ఆందోళనకు కారణమవుతోంది..
కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి ప్రధాన కారణం.. సార్వత్రిక ఎన్నికలతో వెళితే సీట్లు తగ్గుతాయనే భయంతోనే.. ముందస్తుగా వెళితే ప్రజల ఫోకస్ అంతా రాష్ట్రం చుట్టూనే తిరుగుతుంటుంది. అందుకే టీఆర్ ఎస్ కు ఎక్కువ పడతాయి. అదే సార్వత్రిక ఎన్నికల్లో ఒకేసారి పోటీపడితే జాతీయ కోణంలో ఎంపీ సీట్లు కాంగ్రెస్ - బీజేపీలకు పడుతాయి. అది ఎమ్మెల్యే అభ్యర్థులపై కూడా పడవచ్చు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సపరేట్ గా వెళితే మొత్తం ప్రజల ఫోకస్ రాష్ట్రం పరిణామాల మీదే ఉండి టీఆర్ ఎస్ గెలుస్తుందని భావిస్తున్నారు.
ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో వ్యూహాత్మకంగా బీజేపీ అధినేత ప్రధాని మోడీని ఒప్పించి ముందస్తుకు వెళుతున్నారు. ఆ తర్వాత మద్దతిస్తానని హామీ ఇస్తున్నారు. అసెంబ్లీ రద్దు అయ్యాక కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముందస్తు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయమే కీలకం. మరి ఇప్పుడు ఒప్పుకున్న మోడీ అప్పుడే ఇలానే ఉంటారా అన్నది ప్రశ్న..
పోనీ మోడీ నిలబడ్డ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలతో జాప్యం చేసినా కేసీఆర్ ఐడియా ఫ్లాప్ అవ్వడం ఖాయం. ఒకవేళ తెలంగాణలోని ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్లినా కూడా తెలంగాణ ముందస్తు ముచ్చటకు బ్రేకులు పడతాయి. ఈ నేపథ్యంలోనే ఎంతో పక్కాగా ప్లాన్ చేసిన కేసీఆర్ ముందస్తు ముచ్చట తీరం దాటుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే..