Begin typing your search above and press return to search.
సెల్యూట్ చేసి సుష్మాను సాగనంపి..కుటుంబం స్ఫూర్తివంతమైన నిర్ణయం
By: Tupaki Desk | 7 Aug 2019 1:40 PM GMTమాజీ కేంద్ర మంత్రి - బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో సుష్మాకు తుది వీడ్కోలు పలికారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - ప్రధాని మోడీ - హోంమంత్రి అమిత్ షాతో పాటు.. భూటాన్ ప్రధాని త్సేరింగ్ తోబ్గే పలువురు నేతలు - బీజేపీ కార్యకర్తలు సుష్మా స్వరాజ్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సుష్మ కుటుంబ సభ్యులు ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది.
బుధవారం ఉదయం సుష్మాస్వరాజ్ నివాసంలో ఆమె పార్థీవదేహానికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - ప్రధాని మోదీ - హోంమంత్రి అమిత్ షా - లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా - ఇతర కేంద్ర మంత్రులు - బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ - విపక్షనేతలు సోనియా గాంధీ - ఇతర ప్రముఖులు - ఆమె పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ - సీనియర్ నేత ఎల్ కే అద్వానీ కన్నీరు పెట్టుకున్నారు.
సుష్మా చివరి గడియల్లో ఆమె కూతురు బాన్సురీ స్వరాజ్ - భర్త స్వరాజ్ కౌశల్ భావోద్వేగానికి లోనయ్యారు. సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరీ స్వరాజ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో సుష్మాకు అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భర్త,కూతురు కన్నీటి పర్యంతమయ్యారు. దుఖాఃన్ని దిగమింగుతూనే సుష్మా పార్ధీవదేహానికి ఇద్దరూ సెల్యూట్ చేశారు. సుష్మా ఇండియన్ ఆర్మీలో చేరాలని భావించారు. అయితే ఆ సమయంలో ఆర్మీలో పనిచేసేందుకు మహిళలకు అవకాశం లేకపోవడం వల్ల ఆమె కల నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు కుమార్తె - భర్త చివరిసారి సెల్యూట్ చేయడంతో అందరూ కంటతడి పెట్టారు.
కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ కూడా సుష్మా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుష్మా భర్త కౌశల్ కు ఆమె లేఖ రాశారు. మీ భార్య మరణం తనను తీవ్ర ఉద్వేగానికి గురిచేసిందని సోనియా ఆ లేఖలో చెప్పారు. ధైర్యం - అంకితభావం కలిగిన నేత సుష్మా అని అన్నారు. సుష్మా తన దౌత్యపరమైన విధానంతో బాధలో ఉన్న ప్రతి ఒక్కరికీ చేరువయ్యారన్నారు. గొప్ప పార్లమెంటేరియన్ అని - ఆమె స్నేహభావం అందర్నీ కట్టిపడేసిందన్నారు. లోక్ సభలో తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని - సుష్మా మరణం తనకు వ్యక్తిగతమైన నష్టమే అని సోనియా అన్నారు.