Begin typing your search above and press return to search.

ముస్లిం వివాహితకు హైకోర్టు అండ

By:  Tupaki Desk   |   6 Aug 2022 8:30 AM GMT
ముస్లిం వివాహితకు హైకోర్టు అండ
X
తలాక్..తలాక్..తలాక్..ముస్లిం వివాహిత మహిళలను చాలా ఇబ్బందులు పెడుతున్న పదాలు. భర్త నిద్రలో మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అనే పదాలను ఉచ్ఛరించినా వెంటనే భార్యకు విడాకులు ఇచ్చేసినట్లే అనే నానుడి అందరికీ తెలిసిందే.

ఇలాంటి తలాక్ విధానాన్ని గతంలో సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. కేవలం తలాక్ అని మూడుసార్లు చెప్పటం ద్వారా భార్యలను భర్తలు వదిలించుకోవటం చట్టప్రకారం తప్పన్నారు. షరియా చట్టాలు వర్తించవని కూడా న్యాయస్థానం చెప్పింది.

ఇదే విషయమై తన దగ్గరకు వచ్చిన ఒక కేసులో హైకోర్టు కూడా వివాహితకే మద్దతుగా నిలిచింది. తలాక్ నామా రాసుకున్నా చెల్లదని స్పష్టంగా తీర్పుచెప్పింది. భర్త నుండి భార్య దూరంగా ఉంటున్నాసరే భరణం పొందేందుకు అర్హత ఉందని కూడా తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లాలోని పొన్నూరుకు చెందిన భార్యాభర్తలు గౌస్ బీ-జాన్ సైదా తలాక్ వివాదం పొన్నూరు కోర్టు తర్వాత గుంటూరు జిల్లా కోర్టు అక్కడి నుండి హైకోర్టుకు చేరుకుంది.

రెండు వైపుల వాదనలు విన్న హైకోర్టు తలాక్ పద్దతిని తప్పుపడుతూ తీర్పుచెప్పింది. చాలా సింపుల్ గా మూడుసార్లు తలాక్ చెప్పేసి భార్యకు విడాకులు ఇచ్చేసినట్లే అని వివాహబంధం నుండి తప్పించుకోలేరని గట్టిగా చెప్పింది. విడాకులు ఇస్తున్నందుకు సరైన కారణాలను చూపించాలని హెచ్చరించింది. తలాక్ అని నోటితో చెప్పినా లేదా రాతపూర్వకంగా రాసి భార్యకు పంపినా విడాకులు అయిపోయినట్లే అని భర్త జాన్ సైదా తరపు లాయర్ వాదనలను హైకోర్టు కొట్టేసింది.

అసలు తలాక్ పద్దతే తప్పన్నపుడు నోటితో చెబితే ఏమిటి ? కాగితంపై రాతపూర్వకంగా పంపితే మాత్రం ఏమిటని హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే కోర్టులు ఏమి చెబుతున్నాయన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పటికే ముస్లింలు విడాకుల కోసం తమ మతపరమైన విదానాలను అనుసరిస్తున్నారు.

ఆ మధ్య దేశవ్యాప్తంగా ముస్లిం యువతులు, మహిళలు తలాక్ పద్దతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆ ఆందోళన ఫలితంగానే సుప్రీంకోర్టు తలాక్ విధానాన్ని రద్దు చేసింది.