Begin typing your search above and press return to search.
అమెరికాలో మనోళ్ల కష్టాలు: ఒకే రోజు ఉద్యోగాలు కోల్పోయిన భార్యాభర్త
By: Tupaki Desk | 23 Nov 2022 5:31 AM GMTఆర్థిక మాంద్యం ఇప్పుడు ప్రపంచాన్ని కమ్మేస్తోంది. అందరినీ రోడ్డునపడేస్తోంది. 2009లో వచ్చిన తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ ఉద్యోగులపై మాంద్యం ప్రభావం తీవ్రంగా పడింది. వేల మంది భారతీయులు ఉపాధి ఉద్యోగాలు కోల్పోయారు. మళ్లీ 2009 నాటి పరిస్థితులే పునరావృతం కానున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే ట్విటర్ మొదలుపెట్టిన తొలగింపుల పర్వాన్ని మెటా (ఫేస్ బుక్), అమెజాన్ , గూగుల్ అందిపుచ్చుకున్నాయి. ఇక కార్పొరేట్ కంపెనీలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. లేఆఫ్స్ పేరుతో ఇంటికి పంపుతున్నాయి.
ఇన్నాళ్లు సాఫ్ట్ వేర్ కొలువు అంటే ఐదురోజుల పని.. వీకెండ్ సెలవులు, లక్షల్లో జీతాలు.. లగ్జరీ లైఫ్ స్టైల్ ఉండేది. కానీ ఇప్పుడు మాంద్యం దెబ్బకు ఉన్న ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్న పరిస్థితి. ఈఎంఐలు భారీగా పెట్టుకున్న ఐటీ ఉద్యోగులకు దిక్కుతోచని పరిస్థితులున్నాయి. అందరూ తొలగిస్తుండడంతో వేరే కంపెనీలో చేరే అవకాశం లేదు. దీంతో ఖాళీగా ఉండి జాబ్ లేక నరకం చూస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో మన భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపులే భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. హెచ్1బీ వీసా కలిగిన భారతీయులు ట్విటర్, మెటా, అమెజాన్ సంస్థల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. మాంద్యం కారణంగా వీరంతా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. మంచి పనితీరు కనబర్చిన వారు కూడా ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి. 2009 నుంచి అమెరికాలో మెటాలో ఐటీలో సీనియర్ గా జాబ్ చేస్తున్న సురభి గుప్తాను తీసేశారు. ఇప్పుడు ఆమెకు మరో ఉద్యోగం దొరకని పరిస్థితి. 15 ఏళ్లుగా కష్టపడి అమెరికాలో స్థిరపడుదామనుకుంటే తీసేసి ఇప్పుడు భారత్ కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని.. 60 రోజుల్లో మరో జాబ్ దొరికేలా లేదని.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక అమెరికాలోని మరో కంపెనీలోని సౌమ్య అయ్యర్ ది ఇదే కథ. ఆమెతోపాటు ఆమె భర్త కూడా సాఫ్ట్ వేర్ జాబ్ కోల్పోయారు. దీంతో వీరు కూడా జాబ్ దొరక్కపోతే పెట్టాబేడా సర్దుకొని భారత్ కు రావాల్సిన పరిస్థితి. దాదాపు తమలో చాలా మంది ఇలా ఉద్యోగాలు కోల్పోయి దయనీయ పరిస్థితులో ఉన్నాయని అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.