Begin typing your search above and press return to search.

భార్య మార్పిడికి అంగీకరించలేదని మహిళపై దాడి

By:  Tupaki Desk   |   18 Oct 2022 4:23 AM GMT
భార్య మార్పిడికి అంగీకరించలేదని మహిళపై దాడి
X
ఆధునిక జీవనశైలిలో అందరూ సుఖాల కోసం బంధాలకు చరమగీతం పాడుతున్నారు. కొత్త రుచుల కోసం భార్యలను బలిపెడుతున్నారు. ఆధునిక సంస్కృతిలో ఇప్పుడు భార్యలను మార్చుకొని ఎంజాయ్ చేసే ఒక కొత్త పోకడ వచ్చి చేరింది. అలా చేయడానికి ఒక మిత్రుడి భార్య ఒప్పుకోలేదని ఆమెపై దాడి చేసే వరకూ వ్యవహారం వెళ్లింది. బికనీర్‌లో భార్య మార్పిడిలో భాగం కావడానికి నిరాకరించినందుకు భార్యపై ఓ భర్త దాడి చేశారు. ఈ కేసులో ఆ భర్త, అతని తల్లి, సోదరిపై కేసు నమోదు చేయబడింది.

ఎఫ్‌ఐఆర్‌లో ఆ మహిళ చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయి. తన భర్త భార్యను ఇచ్చిపుచ్చుకోవడం.. అతని స్నేహితులతో శారీరక సంబంధం కలిగి ఉండమని తనపై ఒత్తిడి తెచ్చాడని బాధిత మహిళ ఆరోపించింది. దానికి నిరాకరించడంతో తనను కొట్టి, లైంగికంగా వేధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అసహజ శృంగారానికి బలవంతం చేశాడని వాపోయింది.

మహిళ భోపాల్ నివాసి. ఆమె భర్త మహ్మద్ అమ్మర్‌ బికనీర్‌లో హోటల్ మేనేజర్. అతనిపై భార్యను మార్పిడి చేయించుకోవడానికి కొట్టాడని భోపాల్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అమ్మర్ ప్రతిపాదనను తిరస్కరించినందుకు తనను 'మూర్ఖురాలు', 'సంస్కృతి లేనిది' అని ఎగతాళి చేశారని మహిళ ఆరోపించింది. తన భర్త డ్రగ్స్ బానిస అని, మగపిల్లలు, అబ్బాయిలతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని మహిళ ఆరోపించింది.

భోపాల్‌లోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ రెండు నెలల క్రితం భర్త టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు ఎదురైన కష్టాలను వారికి వివరించింది. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినప్పటి నుంచి అమ్మర్‌ పరారీలో ఉన్నాడు. తన భర్తతో పాటు అత్త, కోడలు ఇద్దరూ కూడా రూ.50 లక్షలు కట్నం డిమాండ్ చేశారని ఆ మహిళ ఆరోపించింది.

తన అత్తమామలు తన ఫిర్యాదులను ఎప్పుడూ పట్టించుకోలేదని.. తనను 'ఆధునిక'గా మహిళగా మారమని కోరుతూనే ఉన్నారని ఆమె చెప్పింది. నెలల తరబడి సాగిన ఈ దాడుల వల్ల తన ఆరోగ్యం క్షీణించిందని కూడా ఆ మహిళ తెలిపింది. ఈ సరికొత్త కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.