Begin typing your search above and press return to search.

మూడో భార్యకు అడ్డంగా ఉందని... రెండో భార్య పై భర్త క్షుద్రపూజలు.!!!

By:  Tupaki Desk   |   6 Dec 2021 6:24 AM IST
మూడో భార్యకు అడ్డంగా ఉందని... రెండో భార్య పై భర్త క్షుద్రపూజలు.!!!
X
సాంకేతికత రోజుకోరీతినా కొత్త పుంతలు తొక్కుతోంది. నేల నుంచి ఆకాశం వరకూ మానవుడు ఒక్కొక్క దాన్ని సాధిస్తూ వస్తున్నాడు. భూమండలం నుంచి చంద్రమండలానికి బాటలు వేస్తున్నాడు. ఇలాంటి ఈ కాలంలో కూడా కొందరు క్షుద్రపూజలను నమ్ముతున్నారు. ఇతరులను ఇబ్బంది పెట్టి భయపెట్టడానికి వీటిని ఆసరాగా చేసుకుంటున్నారు. తాత ముత్తాతల కాలం నాటి ఈ విద్యను ఇప్పటికీ నమ్మి ఆచరిస్తున్నారు కొందరు.

అయితే సాధారణంగా ఇలాంటివి చేయడానికి కారణం ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే కోరిక.. లేక వారిని చంపాలనే పగ కొందరితో ఇలాంటి పరిస్థితులకు దారి తీసేలా చేస్తుంది. అంతేకాకుండా మరికొందరు అయితే గుప్త నిధులను పొందేందుకు కూడా వీటిని ఆచరిస్తారు. కానీ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం కి చెందిన ఓ వ్యక్తి తన భార్య పై క్షుద్ర పూజలు చేయించాడు.

ఇందుకు గల కారణం ఏమిటంటే... అతనికి, అతని మూడో భార్యకు మధ్య రెండో భార్య అడ్డు రావడమే. ఇప్పుడు ఈ క్షుద్ర పూజల విషయం స్థానికంగా కలకలం రేపుతోంది అసలేం జరిగిందో ఓసారి మనమూ తెలుసుకుందాం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణ లో నివసించే కుమార్ అనే వ్యక్తి తన భార్య పైనే క్షుద్ర పూజలు చేయించాడు. ఆమె ఇంట్లోనే పెద్ద ముగ్గు వేసి అందులో మధ్య భాగంలో ఆమె ఫోటో పెట్టి పూజలు నిర్వహించాడు. ఇటీవలే కుమార్ పెళ్లి చేసుకున్న మూడో భార్యకు, కుమార్ కు ఆమె అడ్డుగా ఉండడమే దీనికి కారణం. మొదటగా కుమార్ కు ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే కొన్నేళ్ల వరకు ఆమెతో కలిసి ఉండి.. చివరకు ఆమెను వదిలించుకున్నాడు.

ఆ తర్వాత గోపిక అనే మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆటో నడిపి జీవనం సాగించే ఈ కుమార్... గోపికకు మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించాడు. పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు కాపురం చేశాడు. ఆమె దగ్గర ఉన్న బంగారం నగలు డబ్బు అయిపోగానే ఆమెను కూడా మెల్లగా సైడ్ చేశాడు.

అయితే ఇటీవల మరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది కుమార్ కు మూడో పెళ్లి అయితే దీనిపై గోపిక తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తీరు మార్చుకోవాలని కుమార్ కు చాలాసార్లు చెప్పింది. కానీ ఇందుకు ససేమిరా అన్న కుమార్ ఏకంగా గోపికను తప్పించేందుకు ఆమె ఇంట్లోనే క్షుద్రపూజలు ను నిర్వహించాడు.

భార్యను తప్పించేందుకు కుమార్ చేసిన క్షుద్ర పూజలు స్థానికంగా కలకలం రేపాయి. అయితే దీనిపై కుమార్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. కానీ దీనిపై పోలీసులు స్పందించలేదని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

వరుసగా ఒక్కొక్కరిని మోసం చేసి పెళ్లి చేసుకున్నా ఈ నిత్య పెళ్లి కొడుక్కి తగిన బుద్ధి చెప్పేలా తగిన చర్యలను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. స్థానిక ప్రజలు కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నారు ఇలా క్షుద్ర పూజలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.