Begin typing your search above and press return to search.

భార్య డెబిట్ కార్డు భ‌ర్త వాడినా అంతే!

By:  Tupaki Desk   |   8 Jun 2018 4:48 AM GMT
భార్య డెబిట్ కార్డు భ‌ర్త వాడినా అంతే!
X
తాజాగా ఇచ్చిన తీర్పు ఒక‌టి ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌ను రేకెత్తిస్తోంది. భార‌త్ లాంటి దేశంలో కొన్ని సాధ్యం కావు. కాగితాల్లో నిబంధ‌న‌ల రూపంలో చూపించినా.. ప్రాక్టిక‌ల్ గా మాత్రం వ‌ర్క్ వుట్ కావు. కానీ.. ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. రూల్ బుక్ ను ఫాలో అవుతూ ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు స‌ర్వ‌త్రా అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి రూల్ స‌రికాద‌న్న మాట‌ను చెబుతున్నారు.

బ్యాంకు డెబిట్ కార్డును ఒక‌రి బ‌దులు మ‌రొక‌రు వాడటం ఎంత ఖ‌రీదైన త‌ప్పో తాజా ఉదంతం స్ప‌ష్టం చేస్తుంది. చివ‌ర‌కు భార్య కార్డును భ‌ర్త కూడా వాడ‌కూడ‌ద‌ని.. ఒక‌వేళ వాడితే ఆ మొత్తాన్ని గాలికి వ‌దిలేయాల‌న్న‌ట్లుగా ఉన్న తీర్పు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కీ జ‌రిగిందేమంటే..

మూడున్న‌రేళ్ల క్రితం బెంగ‌ళూరులోని మార్త‌హ‌ళ్లికి చెందిన వంద‌న త‌న బ్యాంక్ డెబిట్ కార్డును భ‌ర్త‌కు ఇచ్చింది. ఏటీఎంకు వెళ్లి రూ.25వేలు డ్రా చేసుకురావాల‌ని కోరింది. ఓకే అన్న ఆయ‌న వెళ్లి ఏటీఎంలో ట్రై చేశారు. డ‌బ్బులు క‌ట్ అయ్యాయి కానీ.. ఆ మొత్తం చేతికి రాలేదు. ఇలాంటి సాంకేతి స‌మ‌స్య‌లు అప్పుడ‌ప్పుడు జ‌రిగేవే కావ‌టంతో బ్యాంకుకు కంప్లైంట్ చేశారు. ఇలాంటి సంద‌ర్భాల్లో 24 గంట‌ల్లో బ్యాంకు ఖాతాలోకి డ‌బ్బులు తిరిగి వస్తుంటాయి.

అయితే.. వంద‌న ఎపిసోడ్‌లో ఆమెకు డ‌బ్బులు తిరిగి రాలేదు. దీంతో వారు బ్యాంకు చుట్టూ తిరిగారు. అయినా ఫ‌లితం లేక‌పోవ‌టంతో చివ‌ర‌కు బెంగ‌ళూరులోని నాలుగో అద‌న‌పు జిల్లా వినియోగ‌దారుల ఫోరంను ఆశ్ర‌యించారు. డెబిట్ కార్డును వినియోగించే విష‌యంలో ఉన్న రూల్స్ ను చూపించిన బ్యాంక్‌.. ఎవ‌రికైతే కార్డు ఇష్యూ చేస్తామో.. వారు త‌ప్పించి మిగిలిన వారెవ‌రూ వాడ‌కూడ‌ద‌ని బ్యాంక్ వాదించింది. ఒక‌వేళ వాడితే.. అది బ్యాంక్ రూల్స్ కు విరుద్ధ‌మ‌ని పేర్కొంది.

ఇరు వ‌ర్గాల వాద‌న‌ను విన్న ఫోరం.. వినియోగ‌దారుడి ఫిర్యాదునుకొట్టి పారేసింది. బ్యాంక్ వాద‌న‌ను బ‌ల‌ప‌ర్చింది. దీంతో.. బ్యాంకు రూ.25వేలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చింది. డెబిట్ కార్డు ఎవ‌రి పేరు మీద ఉంటే త‌ప్పించి.. మ‌రొక‌రి చేతికి ఇస్తే (అది చివ‌ర‌కు భార్య‌/ భ‌ర్త అయినా స‌రే) ఏటీఎంలో వినియోగించిన మొత్తం చేజారుతుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మీ డెబిట్ కార్డును ఎవ‌రికైనా ఇవ్వాల‌నుకుంటే ఆ ఆలోచ‌న‌ను ఈ క్ష‌ణం నుంచే మ‌ర్చిపోవాల‌ని చెబుతున్నారు. అయితే.. ఈ తీర్పు స‌రికాద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.