Begin typing your search above and press return to search.
కేరళలో మరో ఘోరం: భార్యను స్నేహితులతో రేప్ చేయించిన దుర్మార్గుడు
By: Tupaki Desk | 7 Jun 2020 11:30 PM GMTఏడడుగులు వేసి జీవితాంతం తన భార్యగా స్వీకరించిన భర్త దుర్మార్గంగా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను కర్కశంగా తన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. అది క్రూరంగా.. మానవత్వం లేకుండా హింసించి రేప్ చేయించాడు. ఇది కన్న కొడుకు ఎదుటనే చేయించడం ఘోరం. అత్యాచారం సమయంలో ఆమెను సిగరెట్లతో కాలుస్తూ నరకం చూపిస్తూ ఆమెపై బలత్కారం చేశాడు. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా ఈ సంఘటన చోటుచేసుకుంది.
తిరువనంతపురానికి చెందిన 25 ఏళ్ల మహిళ, భర్త, కుమారుడితో కలిసి నివసిస్తోంది. జూన్ 4వ తేదీ గురువారం తన భార్య, ఐదేళ్ల కుమారుడిని తీసుకుని భర్త బీచ్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ కొద్దిసేపు సేదతీరిన అనంతరం అక్కడి నుంచి వారిని తీసుకుని తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అప్పుడు తన ప్లాన్ ప్రకారం భార్యను తన స్నేహితులకు అప్పగించాడు. అక్కడ తన భార్యకు బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత తన నలుగురు స్నేహితులతో ఆమెపై సామూహికంగా అత్యాచారం చేయించాడు. ఈ సందర్భంగా ఆ స్నేహితులు ఆమెతో పాశవికంగా ప్రవర్తించారు. ఆమె శరీరాన్నిసిగరెట్లతో కాలుస్తూ పాశవిక ఆనందం పొందారు. ఇదంతా ఆ వ్యక్తి తన కొడుకు ఎదుట చేయించడం దారుణం.
అనంతరం ఆమెను రోడ్డు పక్కన పడేశారు. అపస్మారక స్థితిలో గాయాలతో పడి ఉన్న ఆమెను ఓ యువకుడు గుర్తించి తన ఇంటికి తీసుకువెళ్లి వైద్యం చేయించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కడినంకుళం పోలీసులు స్పందించి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలి వద్ద నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. మానవ విలువల మంటగలిసేలా భర్త తీరు ఉంది. తన స్నేహితులతో భార్యను కన్నకొడుకు ఎదుట అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.