Begin typing your search above and press return to search.

వివాహేత‌ర సంబంధం చిచ్చు.. భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

By:  Tupaki Desk   |   22 July 2020 5:30 PM GMT
వివాహేత‌ర సంబంధం చిచ్చు.. భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌
X
వేరే మ‌హిళ‌తో వివాహేతర సంబంధం కొన‌సాగిస్తుండ‌డంతో వద్దని భార్య చెప్ప‌గా ఆగ్ర‌హంతో ఊగిపోయిన భ‌ర్త క్షణికావేశంలో ఆమెను దారుణంగా హ‌త్య చేశాడు. కత్తితో తల నరికి మొండెం వేరు చేసి దూరం దూరం ప‌డేశాడు. ఈ ఘ‌ట‌న స‌త్తెన‌ప‌ల్లిలో క‌ల‌క‌లం రేపింది. పోలీసులు కొద్దిదూరంలో ఉన్న చోటే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. పోలీసుల వివరాల ప్ర‌కారం..

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఎన్నెస్పీ కెనాల్ క్వార్టర్స్‌ ఏరియాకి చెందిన శ్రీనివాసరావు ఫిరంగిపురం పరిధిలో లస్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య అంకమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే శ్రీనివాసరావు మరో మహిళతో వివాహేతర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో మంగళవారం రాత్రి కూడా గొడ‌వ జ‌రిగింది. అర్ధ‌రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఇద్దరు ఘర్షణ ప‌డ్డారు. ఇక విసుగెత్తిన భార్య తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బ‌య‌ట‌కు వచ్చింది. అయితే అప్ప‌టికే మద్యంమత్తులో ఉన్న శ్రీనివాసరావు ఇది స‌హించ‌లేక‌పోయాడు. ఆ వెంట‌నే ఆమె వెంట కత్తితో బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

రోడ్డుపైన‌ భార్యపై క‌త్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అతి క్రూరంగా తల నరికి మొండెం నుంచి వేరుచేసి హత్య చేశాడు. తలను అక్కడి నుంచి దూరంగా విసిరేశాడు. తల లేని మొండెం వ‌దిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌నతో అక్క‌డి స్థానికులు ఉలిక్కిప‌డ్డారు. అర్ధ‌రాత్రి హ‌త్య వార్త విని భయాందోళన చెందారు. అనంతరం నిందితుడు శ్రీనివాసరావు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. మెయిన్ రోడ్డుపై పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌డు ఈ హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.