Begin typing your search above and press return to search.

భార్య‌ను న‌రికి ముక్క‌లు చేసి.. కాలువ‌లో ప‌డేశాడు.. రీజ‌న్ 'అదే'

By:  Tupaki Desk   |   6 Jan 2023 12:30 PM GMT
భార్య‌ను న‌రికి ముక్క‌లు చేసి..  కాలువ‌లో ప‌డేశాడు.. రీజ‌న్ అదే
X
ఇటీవ‌ల కాలంలో నేరాలు.. ఘోరాలు.. దారుణంగా పెరుగుతున్నాయి. పోలీస్టేష‌న్ల‌కు వెళ్లినా, కోర్టుల‌కు వెళ్లినా.. త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం ఆల‌స్య‌మవుతుంద‌ని భావిస్తున్నారో.. లేక నేరానికి త‌గిన శిక్ష‌లు ప‌డ‌డం లేద‌ని భావిస్తున్నారో తెలియ‌దుకానీ.. అమానుషాల‌కు.. దిగుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్‌లో చోటు చేసుకున్న దారుణ ఘ‌ట‌న అంద‌రినీ నివ్వెర‌పోయేలా చేసింది.

క‌ట్టుకున్న భార్య‌ను అనుమానించిన భ‌ర్త‌.. ఆమెను దారుణంగా హతమార్చాడు. అంత‌టితో కూడా ఆగ‌కుండా.. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికేశాడు. తలను మొండాన్ని వేరు చేసి కాలువలో పడేశాడు. అనంతరం త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌న్న‌ట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జల్పాయ్గుడి జిల్లాలోని శిలిగుడి మున్సిపాలిటీ పరిధిలో జ‌రిగిన ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది.

విష‌యం ఏంటంటే.. మొహమ్మద్ ఆన్సరుల్ ... రేణుకా ఖాతున్ భార్యాభ‌ర్త‌లు. స్థానిక‌ ప్రకాశ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. మొహమ్మద్ ఆన్సరుల్ రంగులు వేస్తూ జీవనం సాగిస్తుండగా.. రేణుకా ఖాతున్ బ్యూటీషియన్‌గా శిక్షణ పొందుతోంది.

ఆరు సంవత్సరాల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా రేణుకా ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భావించిన మొహమ్మద్.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.

డిసెంబర్ 24న భార్యను ఎవ్వరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లిన మొహమ్మద్.. ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఆమె శరీరం నుంచి మొండాన్ని వేరు చేసి ఓ కాలువలో పడేశాడు. అనంతరం మరుసటి రోజు తన మామతో కలిసి భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేసిన పోలీసులు.. మొహమ్మద్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తేల్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.