Begin typing your search above and press return to search.

కూరలో ఉప్పు ఎక్కువైందని ..భార్య ని హత్య చేసిన భర్త !

By:  Tupaki Desk   |   12 May 2020 1:30 PM GMT
కూరలో ఉప్పు ఎక్కువైందని ..భార్య ని హత్య చేసిన భర్త !
X
భార్య , భర్తల బంధానికి ఈ ప్రపంచములో ఏ బంధం కూడా సాటిరాదు. కానీ, ఈ మధ్య కాలంలో అలాంటి పవిత్రమైన బంధాలను మరచి క్షణికావేశంలో అనేక తప్పులకి పాల్పడి ..ఇద్దరి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కట్నం కోసం వేధించి, మటన్ కూరలో ఉప్పు ఎక్కువైంది అని భార్య గొంతునులిమి చంపేసాడు ఓ కసాయి భర్త. ఈ సంఘటన ఆదివారం రాత్రి బాగేపల్లి తాలుకాలోని చేళూరు సమీపంలో ఉన్న హోసహుడ్య గ్రామంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. రెండేళ్ల కిందట బాగేపల్లి తాలూకాలోని మరవపల్లి గ్రామానికి చెందిన బాలచంద్ర, మధురను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు కారు డ్రైవర్‌ గా పనిచేసేవాడు. తరువాత మధుర తల్లిదండ్రులు అతనికి భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ మద్యానికి బానిస అయిన బాలచంద్ర రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడి మరింత వరకట్నం తేవాలని వేధించేవాడు. మధుర గతంలో కాన్పునకు పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంటోంది. వారికి 11 నెలల మగబిడ్డ ఉన్నాడు.

బాలచంద్ర వారం రోజులకు ఒక సారి భార్య వద్దకు వచ్చి వెళుతుండేవాడు. ఆదివారం వచ్చిన బాలచంద్ర రాత్రి భోజనం తిని మాంసంలో ఉప్పు ఎక్కువైందని గలాటా చేయసాగాడు. మదుర చెల్లి భార్యభర్తల మధ్య గొడవలో ఎందుకని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మత్తులో ఉన్న బాలచంద్ర భార్య గొంతుపిసికి చంపి చున్నీతో మెడకు కట్టి కిటికి ఉరి వేసుకున్నట్లు కథ అల్లాడు. అయితే, అప్పటికే మధుర అరుపులు విని బయటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు వచ్చి ఘోరం వెలుగుచూసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలచంద్రను పట్టుకోవడానికి యత్నించారు. ఆ నీచుణ్ని తమకి అప్పగించాలని పోలీస్ వాహనం పై గ్రామస్థులు రాళ్లు వేశారు. వారికీ సర్ది చెప్పి పోలీసులు ఆ కీచక భర్తను పోలీస్ స్టేషన్ కు తరలించారు.