Begin typing your search above and press return to search.
ఒక్క రాత్రి రెండుసార్లు సెక్స్‌కు నిరాకరించిందని భర్త చేసిన దారుణమిది!
By: Tupaki Desk | 9 Dec 2022 10:30 AM GMTఒక మహిళకు ఇష్టం లేకుండా ఆమె భర్త సైతం తాకకూడదని కోర్టులు సైతం ఇటీవల తీర్పునిచ్చాయి. భార్య ఇష్టం లేకుండా ఆమెను అనుభవించడానికి ప్రయత్నిస్తే భర్త మీద అయినా సరే అత్యాచార నేరం కింద కేసు కూడా పెట్టవచ్చంటూ న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చింది.
అయితే ఒక రాత్రి తన భార్య మరో రౌండ్ సెక్స్ వద్దన్నందుకు ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. నిద్రపోతున్న ఆమెను లేపి ఓసారి తన కోరిక తీర్చుకున్న భర్త మరో రౌండ్ కూడా కావాలని అడగడంతో ఆమె తిరస్కరించింది. దీంతో రెచ్చిపోయిన ఆ కీచక భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని అర్మోహ జిల్లాలో ఓ వ్యక్తి ఒకే రాత్రిలో రెండుసార్లు సెక్స్‌కు నిరాకరించినందుకు తన భార్యను హత్య చేశాడు. 34 ఏళ్ల మొహమ్మద్ అన్వర్ తన 30 ఏళ్ల భార్య రుఖ్సర్‌ను ఒకే రాత్రిలో రెండుసార్లు సెక్స్ చేయడానికి నిరాకరించడంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డిసెంబర్ 5 రాత్రి తన భార్యను సెక్స్ కోసం నిద్ర లేపినట్లు అన్వర్ పోలీసులకు ఇచ్చిన వీడియో స్టేట్‌మెంట్‌లో తెలిపాడు. ఆ రాత్రి ఓసారి సెక్స్ లో పాల్గొన్నాక మళ్లీ కాసేపు ఆగి సెక్స్ చేయాలనుకున్నాడు. అయితే అందుకు అతడి భార్య రుఖ్సర్ నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అన్వర్ ఆవేశంతో కత్తితో ఆమె గొంతుకోసి హత్య చేశాడు.
అనంతరం తన భార్య మృతదేహాన్ని పాలిథిన్ సంచిలో నింపి ఇంటికి 50 కిలోమీటర్ల దూరంలో పడేశాడు. అదే రోజు తన భార్య కనిపించకుండా పోయిందని ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు ఠాకూర్‌ద్వారాలోని రతుపురా గ్రామ సమీపంలో ఓ మహిళ మృతదేహం లభించింది. పోలీసుల విచారణలో ఆమె రుక్సర్ అని తేలింది.
పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. అన్వర్‌ను తమదైన శైలిలో విచారించగా.. తానే తన భార్యను హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. తాను సెక్స్ కావాలని అడిగితే ఒక్కసారే పాల్గొందని.. మరోసారి కూడా చేద్దామని అంటే తిరస్కరించిందని తెలిపాడు. దీంతో కోపమొచ్చి ఆమెను హత్య చేశానని వివరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మరోవైపు తల్లి హత్యకు గురి కావడం, తండ్రి జైలుపాలు కావడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.