Begin typing your search above and press return to search.
భార్యకు ప్రేమతో.. వావ్.. మీరు గ్రేట్ అంకుల్..!
By: Tupaki Desk | 15 Nov 2021 1:30 AM GMTపెళ్లి కాగానే చాలు భార్య అంటే బానిసల్లాగే చూస్తారు కొందరు. ఇక తనకూ, తన కుటుంబానికి జీతం లేని పని మనిషి అనే ధ్యాసలో ఉండేవారు కూడా ఉంటారు. ఇక ఇంట్లో ఉన్న ఆ మనిషిని, ఆమె మనసుని పట్టించుకోకుండా బయటి వ్యక్తులతో చక్కర్లు కొట్టేవాళ్లు కూడా ఉంటారు. కట్టుకున్న భార్య కళ్ల ముందు ఉన్నా కూడా పట్టించుకోరు. ఇలాంటి సమయంలో భార్యను దేవతలాగా చూసేవాళ్లు లేకపోలేదు. తాళికట్టిన మరుక్షణం నుంచే ఆమె ప్రపంచాన్ని వీడి... అతడి ప్రపంచంలోకి వచ్చిన ఆమెను ప్రాణంగా చూసుకునే భర్తలూ ఉంటారు. అందుకు నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన మండవ కుటుంబరావు.
మండవ కుటుంబరావు విజయవాడలో స్థిరపడ్డారు. ఆయన భార్య కాశీ అన్నపూర్ణమ్మ. ప్రాణంగా చూసుకునే తన అర్ధాంగిని ఏడాది కిందట కోల్పోయారు. కాశీ అన్నపూర్ణమ్మ సంవత్సరం కిందట మరణించారు. ఇక ఈ వయసులో ఆమె ఎడబాటు కుటుంబరావును ఎంతో కుంగదీసింది. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఓ శిల్పి వద్దకు వెళ్లి తన భార్య ఫొటో చూపించారు. అచ్చం సజీవంగా ఉన్నట్లు విగ్రహం కావాలని కోరారు. ఆ శిల్పి అందుకు అంగీకరించారు. ఆ విధంగా విగ్రహం తయారు చేయించారు. ఆయన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నారు. అయితే ఇవాళ వారికి ఓ స్పెషల్ డే అన్నమాట.
ఏడాది కింద కాలం చేసిన జ్ఞాపకాలతో ఎలాగోలా ఆయన కాలం వెల్లదీస్తున్నారు. అయితే నవంబర్ 14 కాశీ అన్నపూర్ణమ్మ పుట్టిన రోజు. భౌతికంగా ఆమె తనతో లేకపోయిన ఆమె బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని కుటుంబరావు ఫిక్సయ్యారు. ఇక శిల్పితో మాట్లాడి విగ్రహం చేయించారు. సిలికాన్ వ్యాక్స్ తో శిల్పి శివవరప్రసాద్ ఆమె విగ్రహాన్ని తయారు చేశారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లో ఓ ఊయలలో ప్రతిష్ఠించారు. ఈ సజీవ శిల్పంలో జీవం ఉన్నట్లే ఉంది. అచ్చంగా మనిషి అక్కడ కూర్చున్నట్లే జీవకళ ఉట్టిపడుతోంది. ఆకుపచ్చని పట్టుచీర, నుదిటిన ఎర్రటి బొట్టు, తలలో మల్లెలు, మెడలో రెండు గొలుసులు, చేతికి గాజులతో ఈ శిల్పాన్ని రూపొందించారు. నిండు ముత్తైదువ రూపంలో ఉన్న ఈ శిల్పం అబ్బురపరుస్తోంది.
భార్యను చిత్రహంసలు పెట్టే భర్తలున్న ఈ కాలంలో... చనిపోయిన భార్య కోసం ఇలా విగ్రహం కట్టించడం నిజంగా విశేషమే. ఇక అన్నపూర్ణమ్మ విగ్రహం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమతో కలిసి ఆమె కూర్చున్నట్లే ఉందని వారి బంధువులు అంటున్నారు. ఇక ఈ సజీవ శిల్పం వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులను అబ్బురపరుస్తోంది. ఇకపోతే సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. భార్యకు ప్రేమతో విగ్రహం కట్టించిన అంకుల్ చాలా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె సజీవంగా ఉన్నట్లే ఉందని అంటున్నారు.