Begin typing your search above and press return to search.

విడ్డూరం : సునామీ లో కొట్టుకుపోయిన భార్య కోసం భర్త వెతుకులాట

By:  Tupaki Desk   |   9 Oct 2022 12:30 AM GMT
విడ్డూరం : సునామీ లో కొట్టుకుపోయిన భార్య కోసం భర్త వెతుకులాట
X
భార్య భర్తల బంధం గురించి ఒక సినిమాలో మన తెలుగు సీనియర్‌ హీరో ఒకరు చాలా గొప్పగా చెప్పారు. ఆయన మాటలు నిజమేనేమో అన్నట్లుగా జపాన్ కు చెందిన ఈ భర్తను చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఆయన పోరాటం.. ఆరాటం ఈ ప్రపంచంలో మరే భర్తకు ఉండదేమో.. అలా చేయలేరేమో అనిపిస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... 2011 సంవత్సరంలో ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన సునామీ ఎన్నో లక్షల మందిని చంపేసిన విషయం తెల్సిందే. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది... ఎంతో మందిని తమ వారు లేకపోవడంతో ఒంటరి వారు అయ్యేలా చేసింది.

జపాన్ కు చెందిన 65 ఏళ్ల వయసు ఉండే యసువో కూడా సునామీలో తన భార్యను కోల్పోయాడు. ఇప్పటికి కూడా ఆయన భార్య మృతి చెందింది అంటే నమ్మలేక పోతున్నాడు. చనిపోయిన భార్య కోసం అతడి యొక్క అన్వేషణ కొనసాగుతోంది.

2013 సంవత్సరం నుండి వారంలో ఒక రోజు చొప్పున సముద్రంలో డైవ్‌ చేసి తన భార్య యొక్క మృతదేహంను వెతుకుతూ ఉన్నాడు. తాను చనిపోయే సమయం కు అయినా తన భార్య ను కొనిపెడతాను అనే నమ్మకంతో అతడు ప్రతి వారం డైవ్ చేస్తూనే ఉన్నాడు. ప్రభుత్వం నుండి అతడు అధికారికంగా డైవింగ్‌ కోసం అనుమతి తీసుకున్నాడు. ఈ భార్య నిజంగా గ్రేట్‌ కదా..!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.