Begin typing your search above and press return to search.
పీరియడ్స్ సమయంలో యువతి పెళ్లి.. విడాకులు కోరిన భర్త
By: Tupaki Desk | 26 Dec 2020 12:30 AM GMTరుతుక్రమం (పీరియడ్స్) సమయంలోనే వివాహం చేసుకుంది ఓ యువతి. ఈ విషయం ఆ సమయంలో వరుడికి తెలియదు. వివాహం జరిగిన తర్వాత భర్తకు విషయాన్ని మెల్లిగా చెప్పింది భార్య. దీనికి పెద్ద రాద్ధాంతం చేసిన భర్త తమ విశ్వాసాలను పెళ్లి కూతురు దెబ్బతీసిందని.. పెద్ద నేరం చేసిందని నానా యాగీ చేశాడు. అంతటితో ఊరుకోకుండా ఏకంగా విడాకులు కోరాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటుచేసుకుంది.
వడోదరకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి గత జనవరిలో టీచర్ అయిన యువతితో వివాహమైంది. నెలసరి రోజే ఈ యువతి పెళ్లి చేసుకుంది. ఇక ప్రత్యేక పూజ కోసం ఓ దేవాలయంలోకి వెళ్లే ముందు ఆ వధువు తాను పీరియడ్స్ లో ఉన్నానని తెలిపింది.
దీనిపై వరుడి తల్లి నానా యాగీ చేసింది. బాహిష్టు సమయంలో పెళ్లి చేసుకొని అపవిత్రం చేశావని మండిపడింది. ఇది తమ మత విశ్వాసాలకు భంగం కలిగిందని వ్యతిరేకించింది. భర్త కూడా ఈ భార్య నాకొద్దు అంటూ విడాకులకు దరఖాస్తు చేశాడు.
యువతి మాత్రం ఇదో పెద్ద విషయం కాదని.. దీనికోసం విడాకులు కోరడం ఏంటని ప్రశ్నిస్తోంది. టీచర్ గా పనిచేస్తున్న తాను తన అన్నకు ప్రతి నెల తాను రూ.5వేలు పంపడమే ఈ వివాదానికి కారణమని ఆమె అంటోంది. అప్పుల పాలైన తన కుటుంబానికి డబ్బులు పంపుతున్నందుకే వీరు విడాకులు కోరారని ఆరోపించింది. ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది.