Begin typing your search above and press return to search.
కానిస్టేబుల్ భార్య అలిగింది.. ఆఫీసర్ ఏం చేశాడంటే?
By: Tupaki Desk | 11 Jan 2023 10:41 AM GMTవద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటారా అని ఓ మహానుభావుడు పెళ్లి గురించి ఓ సినిమాలో పాట కూడా రాశాడు. పెళ్లికి ముందు బ్యాచిలర్స్ ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా.. ఇంట్లోవాళ్లు గానీ ఫ్రెండ్స్ గానీ పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక్కసారి పెళ్లయిందా.. ఇక వాడి బతుకు బస్టాండే. అందరి లైఫ్ ఇలా ఉంటుందనీ కాదుగానీ.. మెజారిటీ శాతం మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే..!
పెళ్లికి ముందు అబ్బాయికి స్వేచ్ఛ ఉంటే పెళ్లి తర్వాత అమ్మాయికి స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఇది కూడా కండీషన్స్ అప్లై.. అందరికీ వర్తించదు. భార్య భర్తలు మాత్రమే ఉంటే సంసారం ఒకలా.. వీరికి పిల్లలు కూడా తోడైతే మరోలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఈ సోదంతా మాకు ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ విచిత్రమైన వార్త మీకోసమే..!
అతడో కానిస్టేబుల్.. రీసెంట్ గా పెళ్లి అయింది. అయితే డ్యూటీ కారణంగా భార్యకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ సమయంలోనే భార్య మేనల్లుడి పుట్టిన రోజు వచ్చింది. దీనికి తప్పకుండా వస్తానని ఆ కానిస్టేబుల్ భార్యకు మాటిచ్చాడు. అయితే అనుకున్నట్లుగా అతడికి సెలవులు మంజూరు కాలేదు. దీంతో విషయం భార్యకు చెప్పగా భార్య అలక బూనింది.
తాను ఫోన్ చేస్తే కనీసం లిప్ట్ కూడా చేయడం లేదు. తీరా ఫోన్ లిప్ట్ చేస్తే వాళ్ల అమ్మకు ఇచ్చి మాట్లాడిస్తోంది. దీంతో మనోడు భార్య అలక ఎలా తీర్చాలా? అని ఆలోచించి.. ఆలోచించి పై అధికారికి ఓ లెటర్ రాశాడు. ప్రస్తుతం ఈ లీవ్ లీటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన గౌరవ్ చౌదరికి 2016లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. భారతదేశం-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న నౌతన్వా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గౌరవ్ చౌదరికి 2022 డిసెంబరులో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యను వదిలి డ్యూటీలో చేరాల్సి వచ్చింది. నాటి నుంచి ఇంటికి వెళ్లలేకపోయాడు.
మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుతుండేవాడు. అయితే జనవరి 10న తన మేనల్లుడి పుట్టినరోజు వేడుకకు వస్తానని హామీ ఇచ్చాడు. అయితే లివ్ దొరకక పోవడంతో ఆ విషయం భార్యకు చెప్పగా ఆమె గౌరవ్ పై అలిగింది. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం మానేసింది. దీంతో భార్య అలకని అర్థం చేసుకున్న గౌరవ్ ఏఎస్పీకి లీవ్ కోరుతూ లేఖ రాశాడు.
'పెళ్లయిన వెంటనే తన భార్యను వదిలి వచ్చినందుకు ఆమె తనపై అలిగిందని.. ఫోన్ కాల్ కు స్పందించడం లేదని.. కొన్నిసార్లు తన ఫోన్ కట్ చేస్తుందని.. ఫోన్ ఎత్తినా మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోందని చెబుతూ వాపోయాడు. తన భార్య అలకను తీర్చేందుకు గాను వారం రోజుల సెలవు కావాలని' వేడుకున్నాడు. అయితే అతడి బాధను.. నిజాయితీని అర్థం చేసుకున్న ఏఎస్పీ ఐదు రోజులు సెలవు మంజూరు చేశాడు.
దీంతో అతడి భార్య వద్దకు ఆఘమేఘాల మీద ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో కానిస్టేబుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇలాంటి పరిస్థితి పగోడి కూడా రావొద్దని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటంతో ఈ న్యూస్ కాస్తా వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.