Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌ధానిలో ఘోరం...

By:  Tupaki Desk   |   18 July 2015 9:49 AM GMT
ఏపీ రాజ‌ధానిలో ఘోరం...
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణం వ‌ర‌కు తాత్కాలిక రాజ‌ధాని కేంద్రం అయిన విజ‌య‌వాడ‌లో దారుణం చోటుచేసుకుంది. ఉన్మాదిలా మారిన ఓ వ్య‌క్తి విజ‌య‌వాడ‌లోని చిట్టినగర్‌లో త‌న పైశాచికాన్ని ప్ర‌ద‌ర్శించాడు. గుంటూరు జిల్లా ఎర్ర‌బాలెంకు చెందిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు చిట్టిన‌గ‌ర్‌కు చెందిన ఆకుల రోజాతో వివాహం జ‌రిగింది. వీరు కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా దూరంగా ఉంటున్నాడు. వీరిద్ద‌రికి తొమ్మిది నెల‌ల బాలుడు ఉన్నాడు.

ఈ ఉద‌యం భార్య నివ‌సిస్తున్న ఇంటికి వెళ్లిన రాజేంద్ర ప్ర‌సాద్ భార్య స‌హా అత్త‌తో గొడ‌వ పెట్టుకున్నాడు. గొడ‌వ ముదిరిపాకాన ప‌డ్డ క్ర‌మంలో అదుపుత‌ప్పిన రాజేంద్ర ప్ర‌సాద్ భార్య, కొడుకు స‌హా అత్త‌పై పెట్రోలు పోసి నిప్పటించాడు. దీంతో ఒక్క‌సారిగా హాహాకారాలు చేశారు. ఈ క్ర‌మంలో స్థానికులు అక్క‌డికి చేరుకోవ‌డంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ పారిపోయాడు. ఈ నేప‌థ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ కోసం గాలింపు చేప‌డుతున్నారు.