Begin typing your search above and press return to search.

మేకప్ లేకుండా భార్యను చూసి షాక్..విడాకులు ఇవ్వాల్సిందే !

By:  Tupaki Desk   |   6 Nov 2021 5:30 AM GMT
మేకప్ లేకుండా భార్యను చూసి షాక్..విడాకులు ఇవ్వాల్సిందే !
X
ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బంధం ఏదైనా ఉంది అంటే అది వివాహ బంధమే. మూడు ముళ్ల బంధంతో ఏకమై, కట్టే కాలేవరకు ఆ బంధం కొనసాగుతుంది. ఈ మధ్య ఆ వివాహబంధాన్ని అపహాస్యం చేస్తూ విడాకులు తీసుకునే వారు కోట్ల కొద్ది ఉన్నారు. సాధారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి విడాకుల కోసం చెప్పిన కారణం విని జడ్జి కూడా షాకయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మేకప్ లేకుండా చూసి అవాక్కైన ఆ భర్త విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కాడు.

అసలేమైందంటే .. ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్ చేసుకుని ఇద్దరూ దగ్గరయ్యారు. ఫొటోల్లో ఆ అమ్మాయిని చూసి అతను ఇష్టపడ్డాడు. డేటింగ్ కు కూడా వెళ్లాడు. పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటి అందగత్తెనే చేసుకోవాలనుకున్నాడు. మొత్తానికి ఆమెను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లైన మరుసటి రోజే ఆమె అసలు అందం చూసి కంగుతిన్నాడు. మేకప్ లేకుండా ఆమెను దగ్గరి నుంచి చూసి జడుసుకున్నాడు. మేకప్ లేకుండా తన భార్య అందంగా కనిపిస్తుందేమోనని నెల రోజుల వరకు ఎదురు చూశాడు.

ఇక ఫలితం లేకా తనతో కలిసి ఉండలేనని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. నేను మోసపోయాను. పెళ్లికి ముందు ఆమె ప్రతి రోజూ ఎక్కువగా మేకప్ వేసుకునేది. పెళ్లైన తర్వాతే ఆమె సహజ అందాన్ని చూసి షాకయ్యాను. మేకప్ లేకపోతే ఆమెను చూడలేకపోతున్నాను. అసలు నేను ఇన్నాళ్లు ప్రేమించిన ఆ అమ్మాయికి.. ఇప్పుడు మేకప్ లేకుండా చూసిన ఈమెకు పోలీకలే లేవు. నాకు విడాకులు ఇప్పించండి అని పిటిషన్ లో పొందుపరిచాడు. ఈ కేసు ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. అక్కడి స్థానిక మీడియాలో ఈ వార్త ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది