Begin typing your search above and press return to search.
జీన్స్ వేసుకుని, డాన్స్ చేయలేదని భార్యకి తీన్ తలాక్.. ఆ తర్వాత ఏంచేశాడంటే !
By: Tupaki Desk | 23 Dec 2020 7:08 AM GMTభార్య జీన్స్ వేసుకుని, డాన్స్ చేయాలని చెప్పడంతో, అది తనకి ఇష్టం లేదు అని భార్య చెప్పడంతో కోపం తో ఆ భర్త తీన్ తలాక్ చెప్పాడు. ఆ తర్వాత అతను అత్తారింటికి వెళ్లి తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరఠ్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే మీరట్ లోని న్యూ ఇస్లాంనగర్ నివాసి అమీరుద్దీన్ కుమార్తె మహజబీకి ఎనిమిదేళ్ల క్రితం హాపుర్ పరిధిలోని పిల్ ఖువా నివాసి అనస్ తో నిఖా జరిగింది. పెళ్లై ఎనిమిదేళ్ల తరువాత అనస్ కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ నేపధ్యంలో పెద్దలు కలగజేసుకుని వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహజలీ.... భర్త తనను జీన్స్ వేసుకోవాలని, డాన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించింది. ఈ మాటలు విన్న పెద్దలు వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు.
అయితే రెండు రోజుల క్రితం అనస్ ఆమె ఇంటికి వచ్చి, తీన్ తలాక్ చెప్పాడు. తరువాత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన చుట్టుపక్కలవారు అతనిపై నీళ్లు పోసి నిప్పును ఆర్పారు. దీంతో అనస్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని అక్కడివారు పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.