Begin typing your search above and press return to search.

పుట్టింటికి భార్య .. 20 మందితో భర్త ఎంజాయ్ ,సూపర్ స్కెచ్ తో పట్టించిన యువతి !

By:  Tupaki Desk   |   8 Jan 2021 11:30 AM GMT
పుట్టింటికి భార్య .. 20 మందితో భర్త ఎంజాయ్ ,సూపర్ స్కెచ్ తో పట్టించిన యువతి !
X
బిటెక్ పూర్తిచేసి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొన్ని రోజులు హాయిగా సంసారం చేశాడు. ఆ సమయంలోనే అతని రంగు బయటపడింది. అమ్మాయిల పిచ్చి ఉండటంతో ఉద్దరగా డబ్బులు సంపాధించాలని అత్యాశ అతనిలో పెరిగిపోయింది. బాగా డబ్బున్న అమ్మాయిలను పెళ్లి పేరుతో ఎంజాయ్ చెయ్యడం, తరువాత చిక్కినకాడికి దోచుకోవడం అతనికి అలవాటుగా మారిపోయింది. ఒకేఒక హాలీవుడ్ సినిమా 50 సార్లు చూశాడు. అంతే ఆ హాలీవుడ్ సినిమాలో విలన్ చేసినట్లు 20 మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడి , ఓ యువతి విషయంలో పప్పులోకాలేసి అడ్డంగా బుక్కై ఊచలు లెక్కిస్తున్నాడు.

చెన్నై సిటీలోని అవడి సమీపంలోని తిరుములైవాయల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాకేష్ శర్మ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువులో ముందుండే రాకేష్ శర్మకు మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్న రాకేష్ శర్మాకు ఆ డబ్బులు సరిపోలేదు. ఎలాగైనా ప్రతినెల లక్షల లక్షలు డబ్బులు సంపాధించాలని రాకేష్ ఆలోచించాడు. చెన్నైలోని కొడుంగైయూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతిని రాకేష్ శర్మ లైన్ లో పెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని, ఈ జీవితానికి నువ్వే నాదేవత, నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధిస్తాను అంటూ రాకేష్ శర్మ భారీ సినిమా డైలాగులు చెప్పాడు. అయితే రాకేష్ శర్మ ప్రవర్తనపై ఆమెకు అనుమానం వచ్చింది. యువతి ఆమె తండ్రికి అసలు విషయం చెప్పడంతో ఆయన కోడుంగైయూర్ పోలీసులకు రాకేష్ శర్మ మీద ఫిర్యాదు చెయ్యడంతో అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.

యువతితో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు, కొన్ని వీడియోలు రాకేష్ శర్మ దగ్గర ఉన్నాయి. ఆ ఫోటోలు వీడియోలు అడ్డం పెట్టుకున్న రాకేష్ శర్మ తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే తనకు డబ్బులు ఇస్తే నిన్ను వదిలి వెళ్లిపోతానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. యువతి తండ్రి మళ్లీ కొడుంగైయూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్లాన్ ప్రకారం డబ్బులు తీసుకోవడానికి మాధవరం ప్రాంతం దగ్గరకు రావాలని ఆమె రాకేష్ శర్మకు ఫోన్ చేసి చెప్పింది. అది నిజమే అని నమ్మి అక్కడికి పోవడంతో ఆ డ్రామా స్కెచ్ వేసిన పోలీసులు ఎంట్రీ ఇచ్చి డబ్బుతో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించి రాకేష్ శర్మను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుకోవడంతో అతని దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. తరువాత రాకేష్ శర్మాను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెండ్ తీశారు.

రాకేష్ శర్మకు ఇంతకు ముందే పెద్దలు నిశ్చయించిన అమ్మాయితో వివాహం అయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే రాకేష్ శర్మ ప్రవర్తనపై విసిగిపోయిన భార్య జెండా ఎత్తేసిందని వెలుగు చూసింది. రాకేష్ శర్మాకు దూరంగా ఉంటున్న అతని భార్య పుట్టింటిలో ఉంటున్నదని పోలీసులు అన్నారు. భార్యకు దూరంగా ఉంటున్న రాకేష్ శర్మ అమాయకులైన అమ్మాయిలకు వలవేసి పెళ్లి పేరుతో వారిని నిలువుదోపిడీ చేస్తున్నాడని చెన్నై సిటీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాకేష్ శర్మ ఖతార్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో రాకేష్ శర్మ I'M NOT HIM సినిమా 30 సార్లు చూశాడు. సినిమా సీన్లలో లీనమైపోయిన రాకేష్ శర్మకు అంతకు ముందే అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉండటంతో ఎలాగైనా సినిమా స్టైల్లో యువతులను మోసం చెయ్యాలని స్కెచ్ వేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిలకు అనుమానం వచ్చి రాకేష్ శర్మను ప్రశ్నిస్తే I'M NOT HIM, అతను వేరే, నేను వేరు అంటూ సినిమా డైలాగులు చెప్పి చాకచక్యంగా తప్పించుకుంటున్నాడని పోలీసులు అన్నారు