Begin typing your search above and press return to search.

భార్య‌ల్ని కొట్టేందుకు 163 పేజీల పుస్త‌కం

By:  Tupaki Desk   |   27 May 2016 12:28 PM GMT
భార్య‌ల్ని కొట్టేందుకు 163 పేజీల పుస్త‌కం
X
మ‌హిళ‌ల హ‌క్కుల గురించి గొంతెత్తే వారు స్పందించాల్సిన స‌మ‌యం. భార‌త‌దేశంలో ఉన్న స్వేచ్చ‌, స్వాతంత్య్రం మ‌న పొరుగున ఉన్న‌దేశాల్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాల‌నుకునే వారికి ఆస‌క్తిక‌ర‌మైన ఉదంతం. పొరుగు దేశ‌మైన పాకిస్తాన్‌ లో భార్య‌ల్ని వేధించేందుకు ఏకంగా 163 పేజీల‌తో పార్ల‌మెంటు చ‌ట్టాల్ని సిద్ధం చేస్తున్నారు.

మ‌హిళా స్వేచ్ఛ‌గురించి పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్త‌మవుతున్న‌ప్ప‌టికీ ముస్లిం సంప్రాదాయం ప్ర‌కారం భ‌ర్త చ‌ర్య‌ల‌ను భార్య భ‌రించాల్సిందేన‌ని అక్క‌డ మత గురువులు, మేధావులతో కూడిన ఓ మండలి నిర్ణ‌యించింది. భ‌ర్త ఎంత వేదించిన ఓర్చుకోవాల‌ని ఒక‌వేళ ఆ భ‌ర్త చేష్ట‌ల‌ను త‌ప్పించుకునేందుకు అంటూ వేరే చోటుకు వెళ్ల‌డం విడాకుల‌తో స‌మాన‌మ‌ని స‌ద‌రు పెద్ద‌లు తీర్మానించేశారు. అంతేకాకుండా భ‌ర్త చెప్పిన‌ట్లే దుస్తులు వేసుకోవాల్సిందేన‌ని తేల్చాశారు. ఒక‌వేళ శృంగారానికి భార్య‌ తిర‌స్కరిస్తే ఆమెను కొట్టవ‌చ్చు అని, ఈ మాట మ‌త‌పెద్ద‌ల‌మైన తాము స్ప‌ష్టం చేస్తున్నామ‌ని క‌రాఖండిగా చెప్పారు. ఇలాంటి కొత్త కొత్త రూల్స్‌ తో 163 పేజీల‌తో రూపొందించిన ముసాయిదాను సీఐఐ అనే పాకిస్తాన్ పెద్ద‌ల వేదిక చెప్పింది.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే పార్ల‌మెంటు ఆమోదం పొందే ముందు త‌మ బృందం మ‌రిన్ని మార్పులు చేయాల‌ని కూడా వారు భావిస్తున్నార‌ట‌.ఖురాన్ బోధనలు, షరియత్.. చట్టాల మేరకే ఈ సిఫారసులు ఉన్నాయని ఆయ‌న వివ‌రించారు. తమ భార్యలపై ఇబ్బందిక‌ర‌మైన సంద‌ర్భంలో చెయ్యి చేసుకునే ప‌రిస్థితినే కొంద‌రు త‌ప్పుప‌డుతుంటే దుర్మార్గపు భర్తలకు ద‌న్నుగా నిలిచేందుకు మ‌త‌పెద్ద‌లు తీర్మానాలు చేయ‌డం దానికి పార్ల‌మెంటు ఆమోదం వేయ‌డం చూసి ఏమ‌నుకోవాలో అర్థం కాని ప‌రిస్థితి అని కామెంట్లు వినిపిస్తున్నాయి.