Begin typing your search above and press return to search.
మజ్లిస్ అభ్యర్థి సంచలనం..'మేం గెలిస్తే మిమ్మల్ని బతకనివ్వరట'
By: Tupaki Desk | 27 Nov 2020 4:18 PM GMTగతంలో ఎప్పుడూ లేని రీతిలో గ్రేటర్ ఎన్నికల్లో మాటలు తూటాల మాదిరి మారుతున్నాయి. నువ్వు ఒకటంటే నేను రెండు అంటా అన్న రీతిలో ఎవరికి వారు ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నారు. పార్టీ ఏదైనా కావొచ్చు.. అడ్డగోలుగా మాట్లాడితే ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. కానీ.. అలాంటిదేమీ లేదన్నట్లుగా ఎవరికి పడితే వారు.. తమకు తోచినట్లుగా మాట్లాడితే.. హైదరాబాద్ బ్రాండ్ మాటేమిటి? అన్నది ప్రశ్న.
ఇవాల్టి డిజిటల్ యుగంలో.. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. సమాచారం ఏదైనా ఇట్టే బదిలీ అయ్యే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో విద్వేషాల్ని పెంచే వ్యాఖ్యలు.. బరి తెగించినట్లుగా నేతలు మాట్లాడే మాటలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావటం ఖాయం. అదే జరిగితే.. ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ కావటం ఖాయమన్నది మర్చిపోకూడదు.
ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా నేతలు ఎవరికి వారు.. వారిస్థాయిల్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా మజ్లిస్ అభ్యర్థి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కిషన్ బాగ్ డివిజన్ బరిలో ఉన్న హుస్సేనీ పాషా మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము గెలిస్తే.. పాతబస్తీ గల్లీల్లో తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు.
‘‘మజ్లిస్ కార్యకర్తలు మిమ్మల్ని బతకనివ్వరు. దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడి ఉన్నా.. వెళ్లిపోక తప్పదు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అంటూ భయాందోళనలు సృష్టించేలా మాట్లాడటం దేనికి నిదర్శనం? ఒక డివిజన్ బరిలో ఉన్న ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి నోటి నుంచే ఇలాంటి మాటలు వచ్చి.. అతగాడు రేపొద్దున ఎన్నికయ్యాక ఎలాంటి తీరును ప్రదర్శిస్తారు? అన్నది ప్రశ్న. ఈ తరహా నేతలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.