Begin typing your search above and press return to search.
ఆ గుడిసె కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
By: Tupaki Desk | 23 Sep 2015 11:30 PM GMT చిన్న గుడిసె వేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది... ఎంతయినా 10 వేలకు మించదేమో.... కానీ ఆ గుడిసె మాత్రం చాలా కాస్ట్లీ... కాస్ట్లీ అంటే మామూలుగా కాదు.. ఆ గుడిసె ఖరీదు పెడితే హైదరాబాద్ లో నాలుగైదు విల్లాలు కొనుక్కోవచ్చు. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా.... ఏకంగా రూ.2.5 కోట్లు. ఇది వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది... పోనీ దీన్నేమైనా బంగారంతో చేశారో... వజ్రాలు పొదిగారో అనుకుంటే అదీ కాదు. మామూలు చెక్కతో చేసిన ఈ గుడిసె ఖరీదు మాత్రం బుర్ర గిర్రున తిరిగేలా చేస్తోంది.
శాన్ ఫ్రాన్సిస్కోలో సంపన్నులుండే ఔటర్ మిషన్ ఏరియాలో ఉండే దీని విస్తీర్ణం 765 చదరపు అడుగులు. దీన్ని 1906 నిర్మించారు. పాతబడిపోయి ఖాళీగా ఉన్న ఈ గుడిసెను ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమ్మాకానికి పెట్టాడు. కాస్ల్లీ ఏరియాలో ఉండడంతో రేటు పెంచేశాడు... మరీ ఇంత రేటా అంటే స్థలం విలువ చూడండి... ఇది కాస్ల్లీ ఏరియా కాబట్టి రేటు ఎక్కువే ఉంటుందని చెబుతున్నాడు. మరి స్థలం కోసమైనా దీన్నెవరైనా కొంటారో లేదో చూడాలి.