Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆలస్యం.. ఎవరికి మేలు.. ఎవరికి కీడు!
By: Tupaki Desk | 8 Sep 2021 11:30 PM GMTఅటు అధికార పార్టీ టీఆర్ ఎస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. వాస్తవానికి ఈ నెలలోనే నోటిఫికేషన్ వస్తుందని అందరూ అనుకున్నారు.కానీ, కరోనా నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికను వాయిదా వేసింది. దీంతో ఇప్పట్లో ఈ పోరు సాగే అవకాశం కనిపించడం లేదు. నిజానికి ఇప్పటికే ఇక్కడ ప్రచారం ప్రారంభించిన బీజేపీ, టీఆర్ ఎస్ నేతలు కూడా సర్దుకున్నారు. వచ్చే రెండు నెలల తర్వాత అంటే.. నవంబరు, లేదా డిసెంబరులో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరి ఇదే జరిగితే.. ఎవరికి లాభం? అధికార పార్టీ టీఆర్ ఎస్ కా? లేక.. ఇక్కడ నుంచి గెలిచి.. కేసీఆర్‌కుచుక్కలు చూపిస్తామంటున్న బీజేపీకా? పోనీ.. ఎవరికి నష్టం.. ఇదీ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం. నిజానికి ఎక్కడైనా.. ఎన్నికలు అనగానే అప్పటి వరకు ఉన్న వేడి వేరుగా ఉంటుంది.. అదే పోరు ఆలస్యమైతే.. ఆవేడి చల్లారడం.. ఈలోగా రాజకీయ సమీకరణలు మారిపోవడం.. జరిగితే.. పార్టీలపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఇదే విషయం.. హుజూరాబాద్‌పైనా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు పరిశీలకులు.
హుజూరాబాద్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీ ఓటమి ఖాయమని అంటున్నారు. దళిత బందు ప్రకటన తర్వాత కూడా మూడొంతుల మంది ఓటర్లు ఇక్కడ నుంచి వరుస విజయాలు దక్కించుకున్న ఈటల రాజేందర్ వైపే ఉన్నారు. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ ద్వారా తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ఎత్తులు మార్చారు.. రాష్ట్రంలో కరోనా లేదు పాడు లేదు అంటూనే, అదే లేని కరోనాను బూచిగా చూపించి, ప్రభుత్వం ఉప ఎన్నికను వెనక్కి నెట్టింది. అంటే.. ఉప ఎన్నికను వాయిదా వేయించడం ద్వారా ఈటల సానుభూతిని తగ్గించాలనేది కేసీఆర్ వ్యూహంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ఈ విషయం అక్కడ ప్రస్తావించారని కూడా సమాచారం.
వాస్తవానికి మంత్రి ఈటలను కేసీఆర్ బర్తరఫ్ చేసిన సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు, దళితుల భూములు లాక్కున్నారనే కేసులు చూపించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా ఈటలను తేలికగా తీసుకున్న కేసీఆర్‌కు ఆయన పాదయాత్రకు వస్తున్న స్పందనతో ఒకింత ఆందోళన ఏర్పడిందనే వాదన ఉంది. ఈ క్రమంలోనే దళిత బంధు పథకాన్ని అనూహ్యంగా హుజూరాబాద్‌లో ప్రవేశ పెట్టారు. పరిస్థితి ఇంతలా ఉంటుందని అప్పుడే తెలిసుంటే, కేసీఆర్ అసలు ఈటల ఉద్వాసన వరకు వెళ్లేవారే కాదని అధికార పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది కాబట్టే కేసీఆర్ వేల కోట్లు కుమ్మరించినా, దళిత బంధు వంటి ‘అద్భుత’ పథకాన్నిప్రవేశ పెట్టినా, తమ శక్తి యుక్తులన్నీ వినియోగించినా, ఈటలను ఓడించే పరిస్థితి లేదన్నది టీఆర్ ఎస్‌లో చర్చగా మారింది.
సో.. దీనిని బట్టి.. ఉప ఎన్నిక వాయిదా వెనుక కారణం కరోనా కాదని, హుజూరాబాద్‌లో ఎక్కడ ఓడుతామేమోననే భయమేనని అంటున్నారు విమర్శకులు. ఉపఎన్నిక రెండు మూడు నెలలు ఆలస్యంగా జరిగినంత మాత్రాన అధికార పార్టీకి ఫలితం దక్కుతుందా అంటే, ఖాయంగా ప్రయోజనం జరుగుతుందని చెప్పే పరిస్థితి లేదనే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలు ఆలస్యం అయిన కొద్దీ కొత్తసమస్యలు చుట్టుముడతాయని, ముఖ్యంగా కేసీఆర్ ఆశలు పెట్టుకున్న దళిత బంధు పథకమే ప్రతికూల అంశంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని 21 వేల పై చిలుకు దళిత కుటుంబాలకు కుటుంబానికి పది లక్షల రూపాయల వంతున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందుకోసం ఇప్పటికే రూ. 2 వేల కోట్లు రిలీజ్ చేసింది. లబ్ధిదారులతో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించింది. మొదటి దశలో ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా వారి ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పటికి దాదాపు 8 వేల మంది ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున డబ్బులు జమ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని తేలడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చే వరకు డబ్బులను లబ్ధిదారులు తమ ఖాతాల నుంచి విత్‌డ్రా చేయకుండా ఫ్రీజింగ్ చేస్తూ అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది.
కొత్తగా ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్ఓ) మెలిక పెట్టింది. అంటే, నియోజకవర్గ పరిధిలోని 21 వేల కుటుంబాలకు లబ్ది చేకూరే సమయానికి పుణ్య కాలం కాస్తా పూర్తయి పోతుంది. అలా కొంతమందికి వచ్చి కొంతమందికి రాక, అదొక సమస్యగా మారుతుంది. అలాగే, ఇతర సామాజిక వర్గాల నుంచి వత్తిళ్ళు పెరుగుతాయి. ఆ వర్గాలు దూరమవుతాయి.. ఇలా కొత్త సమస్యలు తలకు చుట్టుకుంటాయని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయం ఇలా ఉంటే.. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయానికి వస్తే.. నియోజక వర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సానుభూతి, సానుకూలత వ్యక్తమవుతున్నాయి.
పార్టీలకు అతీతంగా ఈటలకు ప్రత్యక్ష పరోక్ష మద్దతు లభిస్తోంది. అయితే ప్రస్తుతం వీస్తున్నఈ సానుకూల పవనాలు, అందాకా అలాగే ఉంటాయా అనేది అనుమానమే అంటున్నారు. ప్రస్తుత సానుకూల పరిస్థితులు నిలబెట్టుకోవడం ఈటలకు అంత సులభం కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలు ఎదుర్కుంటూ, పట్టు నిలుపుకోవడమే అంటే అది మాములు విషయం కాదు. సో.. ఎలా చూసినా.. ఈ ఉప ఎన్నిక ఆలస్యం కావడం.. అటు అధికార పార్టీకి, ఇటు ఈటలకు కూడా మరిన్ని సమస్యలు తెచ్చిపెడతాయని అంటున్నారు పరిశీలకులు.
ఇక ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా బరిలో దిగలేదు. కానీ ఇప్పుడు కావలసినంత సమయం చిక్కడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే, అది కేసీఆర్ కే కాదు ఈటలకు చిక్కులు తెచ్చిపెడుతుందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఈటల పట్ల సానుకూలత ఉన్నా, ఆయన బీజేపీ అభ్యర్ధి కావడం వలన కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వక తప్పదు. సో, కాంగ్రెస్ బరిలో దిగితే అది ఈటల గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తుందని, ఆ కోణంలో చూసినప్పుడు ఈటలకు, ఆలస్యం అమృతం విషంగా మారుతుందని అంటున్నారు.