Begin typing your search above and press return to search.

హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్

By:  Tupaki Desk   |   1 Oct 2021 6:40 AM GMT
హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్
X
హుజురాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలను హుజూరాబాద్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి వెల్లడించారు. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని వివరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో కరోనా వైరస్ నిబంధనలు అమలు చేస్తున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నేటి ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.

అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే తొలిరోజు ఎవరూ నామినేషన్లు వేసేటట్టు కనిపించడం లేదు. మంచి రోజు చూసుకుని అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్‌, నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి జూన్ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రచార పర్వంలో దూకుడుగా వెళుతుండగా కాంగ్రెస్‌ లో మాత్రం ఇంకా సబ్దత వీడలేదు. శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం మెదలుకానుంది. ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత ఐదు నెలలుగా హుజురాబాద్ లో రాజకీయం వేడెక్కుతునే ఉంది. ఇటు బీజేపీ, అటు టీఆర్ ఎస్, వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ రెండు పార్టీలు దృష్టినంతా హుజురాబాద్ పైనే పెట్టాయి.

అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ ను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించగా బీజేపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఈటెల రాజేందర్ పేరు ఆపార్టీ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. అయితే ఐదు నెలల అవకాశాన్ని అంది పుచ్చుకుని అభ్యర్థి ఖరారు చేయడంలో కాంగ్రెస్ మాత్రం మల్లగుల్లాలు పడుతుంది. అభ్యర్థి ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానించి ఎంపికపై ఇంకా కసరత్తు సాగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, పత్తి కృష్ణా రెడ్డి మరో ఇద్దరు ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి. వీటితో పాటు టీడీపీ, వామపక్ష పార్టీలు, వైయస్ఆర్ టీపీ మిగతా పార్టీలు సైతం బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ బరిలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఫీల్డ్ అసిస్టెంట్ లు సైతం పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈసారి భారీ బహిరంగ సభలకు ఆస్కారం లేకుండా పోయే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 8 వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంది. నామినేషన్ వేసేందుకు వెళ్లే అభ్యర్థులు సరైన పత్రాలతో రావాలని అభ్యర్థి తప్పనిసరిగా రెండు వ్యాక్సిన్ లు వేయించుకోవలనే నిబంధన ఉంది. ఇప్పటికే నామినేషన్లు స్వీకరించే, హుజురాబాద్ ఆర్ డి ఓ ఆఫీసులో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి అభ్యర్థి.. నిబంధనలు పాటించాలని అధికారులు అంటున్నారు. హుజూరాబాద్‌ తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గానికి కూడా అక్టోబ‌ర్ 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక దేశ వ్యాప్తంగా మ‌రో 28 అసెంబ్లీ, 3 లోక్‌ స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌ల‌కు కూడా ఇదే షెడ్యూల్ విడుదల చేసింది.