Begin typing your search above and press return to search.
హుజురాబాద్ బైపోల్: ఏజంట్లకి ఆ సర్టిఫికెట్ తప్పనిసరి.. ఫేక్ న్యూస్ లపై కేసు!
By: Tupaki Desk | 29 Oct 2021 3:30 PM GMTతెలంగాణ లో మరో మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా ఎదురుచూసిన ఆ క్షణం వచ్చేసింది. హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటెల అన్నట్టుగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ పోలింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లని ఇప్పటికే పూర్తి చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఎలక్షన్ సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని వివరించారు. 30 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని, బ్లైండ్ పర్సన్స్ కోసం బ్రేల్ బ్యాలెట్ పేపర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3865 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని.. ప్రతీ బూత్‌లో వెబ్ కాస్టింగ్ తో పర్యవేక్షణ చేయనున్నట్లు వివరించారు.
హుజురాబాద్ నియోజక వర్గంలోని ఓటర్లకు 100 శాతం ఫస్ట్ డోస్, 75 శాతం సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యిందని తెలిపారు. కోడాఫ్ కాండక్ట్ కోసం పూర్తి స్థాయి నిఘా పెట్టామని ఫిర్యాదులపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 3కోట్లు 50లక్షలు క్యాష్, 7 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 1175 బాటిల్స్ లిక్కర్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం7 వరకు పోలింగ్ ఉంటుందని శశాంక్ గోయల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 366 పోలింగ్ స్టేషన్లలో 127 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లుగా గుర్తించినట్లు తెలిపారు.
ఫేక్ న్యూస్ లపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఎటువంటి అనుమతులు లేకుండా డబ్బు తరలిస్తున్న88 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 72 గంటల సైలెన్స్ పీరియడ్‌లో ప్రచారాలపై సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామన్నారు. డబ్బులు ఇవ్వాలని ఆందోళన చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు. ఏజంట్లుగా ఉండే వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉండాలని, దీనితో పాటుగా కరోనా మహమ్మారి లేదని ఆర్టీపీసీఆర్ సర్టిఫికేట్ ఫై ఉండాలని చెప్పారు. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో 84.40 ఓటింగ్ శాతం నమోదైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అంతకుమించి పోలింగ్ జరుగుతుందని ఉహిస్తునట్టు తెలిపారు.