Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ బైపోల్: సీఎం కేసీఆర్ దూకుడు

By:  Tupaki Desk   |   11 Aug 2021 11:30 AM GMT
హుజూరాబాద్ బైపోల్: సీఎం కేసీఆర్ దూకుడు
X
తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు హుజూరాబాద్ వైపు చూస్తోంది. ఇక్కడ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ ఇప్పటినుంచే మొదలైంది. ఇంకా నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా..నేనా.. అన్నట్లుగా సాగుతుంటే కాంగ్రెస్ పాగా వేస్తామంటోంది. టీఆర్ఎస్ నుంచి బర్త్ రఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ ను ఓడించాలని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రజలను ఆకట్టుకునేందకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు తెర వెనుక ఉండి నడిపించిన కేసీఆర్ ఇక ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు.

ఈనెల 26న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో పర్యటించనున్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ప్రొసిడింగ్ పత్రాలు లబ్ధిదారులను అందజేయనున్నారు. ఈ పథకానికి సంబంధించి రూ.500 కోట్లు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం కేసీఆర్ పర్యటన తరువాత అర్హులకు అందించనుంది. దీంతో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నియోజకవర్గ బాధ్యతలు అప్పటిగించిన హరీశ్ రావు ఇన్నాళ్లు తన వ్యూహంతో వ్యవహారాన్ని నడిపించారు. బుధవారం ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారు. ప్రత్యక్షంగా పరిస్థితులను గమనించున్నారు.

ఇదిలా ఉండగా ఈటల రాజేందర్ బీజేపీలో చేరి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పాదయాత్ర పేరుతో గ్రామగ్రామాన తిరుగుతున్నారు. ఆయన పాదయాత్రలో కొంతమంది దళితులు ఆయన కాళ్లు కడిగిన వార్తలు బయటికి వచ్చాయి. దీంతో దళితులు ఈటల రాజేంద్ వైపే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో దళిత బంధు పథకం ద్వారా దళితులను ఈటల వైపు వెళ్లకుండా మంత్రలు ఇప్పటికే పలు విధాలుగా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు లేఖలు రాయనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి గురించి లేఖలో ప్రస్తావించనున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సాయం చేసిందు ఇందులో తెలుపనున్నారు. ఇప్పటికే రైతు బంధు, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణి పథకాలు ప్రశేశపెట్టింది. ఇక కొత్తగా దళితుల అభివృద్ధికి దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం చేసే, చేసిన పనులను ఈ లేఖలో ప్రస్తావించనున్నారు.

బీజేపీలో చేరిన ఈటల దూకుడు పెంచారు. ఓ వైపు పాదయాత్ర చేపడుతూనే కేసీఆర్, హరీశ్ రావు లాంటి ముఖ్యనేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో హరీశ్ రావు, కేసీఆర్ లు ప్రత్యక్షంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దళిత బంధు పథకం ద్వారా కేసీఆర్ ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించనున్నారు. అంతేకాకుండా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 20 వేల కుటుంబాలకుపైగా సంక్షేమ పలాలు అందించనున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేయనున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ కు చెందిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులు, ఆసరా పింఛన్లు అందించి ఆకట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మరోసారి టీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే మరిన్ని సంక్షేమ ఫలాలు వస్తాయని చెబుతున్నారు. అయినా దళిత బంధు తమ ఖాతాల్లోకి వస్తేనే టీఆర్ఎస్ కు ఓటేస్తామని ఇటీవల కొందరు దళితులు అన్నారు.

దీంతో కేసీఆర్ హూటాహుటిన రూ.500 కోట్లు విడుదల చేశారు. వాటిని లబ్ధిదారులకు అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ పేరు వినిపిస్తుండగా ఫైనల్ గా కేసీఆర్ ఆయనకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.