Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ షాక్: రేవంత్ కీలక నిర్ణయం?

By:  Tupaki Desk   |   12 July 2021 1:39 PM GMT
హుజూరాబాద్ షాక్: రేవంత్ కీలక నిర్ణయం?
X
టీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటూ టైం చూసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టారు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారన్న విషయం తేటతెల్లమైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట.. ఈ క్రమంలోనే పార్టీలో వారిని గుర్తించి ఏరివేయడంతోపాటు ఇక నుంచి వారి పట్ల కటినంగా వ్యవహరించేలా శ్రేణులకు సంకేతాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడట..

ఇటీవలే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీని గట్టి పోటీనిచ్చేలా చేయాలని ప్లాన్ చేశాడు. తనకు సన్నిహితుడైన కౌశిక్ రెడ్డిని గెలిపించాలని అనుకున్నాడు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంటుందనే సమయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంట్రీతో త్రిముఖ పోరు ఖాయం అనుకున్నారంతా.. కౌశిక్ తోపాటు రేవంత్ కూడా దిగితే కాంగ్రెస్ ముద్ర పడుతుందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి.

అయితే హుజూరాబాద్ నుంచి గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కౌశిక్ రెడ్డి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్ లో చేరడానికి రెడ అయ్యారు. టీఆర్ఎస్ టికెట్ ఖాయం కావడంతో కాంగ్రెస్ ను మోసం చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన ఆడియో విన్నాక కాంగ్రెస్ లో ఉంటూనే కౌశిక్ రెడ్డి ఇంత కథ నడిపిన వ్యవహారం సంచలనమైంది.

గతంలో ఒకసారి కౌశిక్ రెడ్డి కేటీఆర్ ను కలిసి మంతనాలు జరిపారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ లోకి వెళ్లి ఆ పార్టీ తరుఫునే నిలబడడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయినా కాంగ్రెస్ లోనే ఉంటూ ఇదంతా చేయడంతో కాంగ్రెస్ వర్గాలు షాక్ తిన్నాయి. ఆడియో టేప్ కలకలం రేపింది.

వెంటనే అప్రమత్తమైన పీసీసీ క్రమశిక్షణ కమిటీ కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో పార్టీకే గుడ్ బై చెప్పడంతో రాజకీయాలు రూపు మారాయి.నిజానికి హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డిని బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి ఎంతో ఆలోచించాడు. యువకుడైన కౌశిక్ పోయిన సారి ఈటలకు గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచాడు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి పోవడంతో రేవంత్ కు తొలి షాక్ తగిలింది.

ఈ క్రమంలోనే కౌశిల్ లాంటి బలమైన అభ్యర్థి పోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో రేవంత్ రెడ్డికి ఎవరికి టికెట్ ఇస్తాడన్నది ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ తర్వాత దీనిపై ఆయన దృష్టి పెడుతారా? అనే చర్చ జరుగుతోంది.

ఇక కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అలెర్ట్ అయ్యాడు. టీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉండే నేతల పట్ల కాంగ్రెస్ పార్టీ కఠినంగా ఉంటుందనే సంకేతాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ఆ రకమైన సంకేతాలను కాంగ్రెస్ నేతలకు ఇవ్వనుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

-ఆడియో లీక్ తో కౌశిక్ రెడ్డి రాజీనామా
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరడం ఖాయమైపోయింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు టీఆర్ఎస్ నుంచే పోటీచేయబోతున్నట్టు ప్రకటించారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని చెబుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ లీకైంది. సోషల్ మీడియా, మీడియాలో వైరల్ అయ్యింది. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాదన్నపేటకు చెందిన విజయేందర్ అనే టీఆర్ఎస్ కార్యకర్తకు ఫోన్ చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని.. గ్రామ యువతను పోగు చేసి ప్రచారం చేస్తే తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని హామీ ఇచ్చాడు. ఈ ఆడియో లీక్ దుమారం రేపడం.. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఇక కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు కౌశిక్ ప్రకటించాడు.