Begin typing your search above and press return to search.
గెలుపెవరిది?: ఈటల సానుభూతినా? కేసీఆర్ సంక్షేమమా?
By: Tupaki Desk | 28 July 2021 8:57 AM GMTహుజూరాబాద్ లో గెలుపెవరిది? ఈటల రాజేందర్ సానుభూతి పనిచేస్తుందా? కేసీఆర్ కురిపిస్తున్న వరాల సంక్షేమం ఫలిస్తుందా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు కాక రేపుతోంది. నియోజకవర్గ ప్రజలు మాత్రం ఉప ఎన్నికతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు చూసి సంబరపడుతున్నారు. తమ బతుకులు ఉప ఎన్నికలతోనైనా బాగుపడ్డాయని అంటున్నారు.
త్వరలోనే హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఉప పోరు.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీల మద్య యుద్ధాన్ని తలపిస్తున్నాయి. అదే సమయంలో ప్రధానంగా ఈటల రాజేందర్ పై ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. దానికి పోటీగా కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపై సంక్షేమ జల్లు కురిపిస్తున్నారు. ‘దళిత బంధు’ సహా కొత్త స్కీంలు అన్నీ హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తున్నారు. ప్రజలను పథకాలతో కొడుతున్నారు. అదే వారిలో టీఆర్ఎస్ వైపు ఆకర్షించేలా చేస్తోంది.
అయితే ఈటల ఏం మామూలు మనిషి ఏం కాదు.. వరుసగా ఐదు సార్లు హుజూరాబాద్ నుంచి ఉద్యమకాలం నుంచి గెలిచాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గడిచిన దశాబ్ధ కాలంలో ఇక్కడ మరెవరికీ ప్రజలు పట్టం కట్టింది లేదు. ప్రజల మనిషిగా ఈటలకు పేరుంది. ప్రజల్లో మంచి పేరుంది. పైగా పేదలు, మధ్యతరగతి ప్రజల్లో ఈటల పట్ల గౌరవం ఉంది. ఆయన టీఆర్ఎస్ లో అంతకుముందు ఎమ్మెల్యేగా ఎన్నో పనులు వారికి చేసిపెట్టారు. మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన సతీమణితో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ బాగోగులు చూసుకునేవారు. అందుకే ఈటల అన్నా.. ఆయన భార్య అన్నా నియోజకవర్గంలో తెలియని వారు లేరు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన సతీమణితో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గం ప్రజల సమస్యలను పట్టించుకొని పరిష్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే ఈటలను తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించడంతో ఆయనపై నియోజకవర్గంలో సానుభూతి ఉంది. అదే ఆయనకు వరంగా మారింది. కేసీఆర్ తన సహచరుడైన ఈటలకు అన్యాయం చేశారనే ప్రచారాన్ని ఈటల వర్గం బాగానే ప్రజల్లోకి తీసుకెళుతోంది. దీంతో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల్లో ఈటలపై ఇప్పుడు సానుభూతి వెల్లువెత్తుతోంది.
ఈటలపై ఎంత సానుభూతి ఉన్నా.. హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ అక్కడ విజయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. ఈ సమయంలో భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఈటల రాజేందర్ ఇప్పుడక్కడ బలంగా తయారయ్యాడు. హుజూరాబాద్ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ మరో భారీ పథకాన్ని ప్రవేశపెట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నే ఎన్నుకోవడం విశేషం. తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఈ పథకం ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక విపక్షాల నుంచి విముక్తులను చేయబోతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని.. దశల వారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80వేల కోట్ల నుంచి రూ.1 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజాగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను కేసీఆర్ నియమించారు.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నుంచి వచ్చిన దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు ప్రగతిభవన్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఉద్దేశించి సమావేశంలో మాట్లాడుతూ ఈ భారీ ప్రకటనలు చేశారు.
మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ తనదైన రాజకీయ చతురతతో ఈటలను ఎలా ఎదుర్కొంటారు? లేదంటే కేసీఆర్ కే ఇది ఎఫెక్ట్ అవుతుందా? అన్నది వేచిచూడాలి