Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ పోలీసుల గాంధీగిరీ

By:  Tupaki Desk   |   19 Feb 2016 4:47 PM GMT
హైద‌రాబాద్ పోలీసుల గాంధీగిరీ
X
చుట్టూ ఉండే ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని పాల‌కులు ఎంతగా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా...స్వ‌చ్ఛ భార‌త్ పేరుతో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నా ప‌లువురు వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. బ‌హిరంగంగా మూత్ర విస‌ర్జ‌న‌ - దూమ‌పానం - ఉమ్మివేయ‌డం వంటివి స‌ర్వ‌సాధార‌ణం, నిత్య‌కృత్యం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌ లోని మ‌హంకాళి పోలీసులు గాంధీగిరీ విధానంలో మార్పు కోసం వినూత్న ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

బ‌హిరంగ మూత్ర విస‌ర్జ‌నను అరిక‌ట్టేందుకు కొత్త ప్ర‌య‌త్నానికి శ్రీ‌కారం చుట్టారు. బ‌హిరంగంగా ప్రభుత్వ స్థ‌లాల్లో మూత్ర విస‌ర్జ‌న చేసే వ్య‌క్తిని గుర్తించి ఆయ‌న మెడ‌లో దండ‌వేశారు. మీరు మ‌రోమారు ఇలాంటి చ‌ర్య చేయ‌కుండా ఉంటామ‌ని ఆశిస్తున్న‌ట్లు స‌ద‌రు వ్య‌క్తితో చెప్పారు. త‌ప్పు చేసినందుకు బొక్క‌లో వేయ‌కుండా మెడ‌లో పూల‌దండతో స‌త్క‌రించ‌డంతో వారిలో కొంత అయినా మార్పువ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్లు పోలీసులు చెప్తున్నారు. గ‌తంలో హెల్మెట్ లేకుండా ప్ర‌య‌ణించిన వారికి చాక్లెట్లు అందించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా మ‌హంకాళి పోలీసులు వార్త‌ల్లో నిలిచారు.

అయితే వేల కోట్లు రూపాయ‌ల పారిశుద్యం ఖ‌ర్చుల కోసం, బ‌హిరంగ‌ మూత్ర విస‌ర్జ‌నను అరిక‌ట్టేందుకు ఖ‌ర్చు చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో మార్పురాక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రోడ్డుపై న‌డ‌వాలంటే ముక్కు మూసుకొని న‌డ‌వాల్సిన ప‌రిస్థితి మార్చేందుకు అంద‌రూ న‌డుం క‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఏమంటారు?