Begin typing your search above and press return to search.
ఎవరీ హైదరాబాద్ అమ్రిష్ పురి!
By: Tupaki Desk | 6 Jun 2019 6:03 AM GMTటీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసం.. డేటా చౌర్యంతోపాటు పలు కేసులు నమోదై.. పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న ఆయన.. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు.. జర్నలిస్టుల వర్గానికి జరుగుతున్న ఇష్యూగా అభివర్ణించటం తెలిసిందే.
విచిత్రమైన విషయం ఏమంటే.. రవిప్రకాశ్ మాటలకు అండగా మీడియా సంస్థలు మాత్రమే కాదు.. సోషల్ మీడియా నుంచి సానుకూలత అస్సలు వ్యక్తం కాని పరిస్థితి. దాదాపు 27 రోజులపాటు పోలీసులతో దాగుడుమూతలు ఆడిన రవిప్రకాశ్.. తాజాగా సైబరాబాద్ పోలీసుల ఎదుట హాజరు కావటమే కాదు.. వారి విచారణను ఎదుర్కొంటున్నారు.
విచారణ సందర్భంగా పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పని ఆయన.. వారికి చుక్కలు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ ప్రశ్నకు ఆయన నుంచి సంతృప్తికర సమాధానం రావట్లేదని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న ఆయన.. వారి నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియాతో మాట్లాడుతూ..మీడియా కబ్జా కాండను ఎదుర్కొంటుందన్న ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.
మీడియాకు.. మాఫియాకు మధ్య తెలుగు నేల మీద యుద్ధం జరుగుతోందని.. ప్రజలు మీడియా వైపు ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చినా ఫలితం ఉండటం లేదు. ప్రజలు మీడియా వైపు ఉండాలని.. తెలంగాణలో మీడియా కబ్జా కాండ కొనసాగుతోందని.. తన స్నేహితులు పెట్టుకున్న మోజో టీవీని ఒక్క రూపాయి చెల్లించకుండా కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఈ సందర్భంగా రవిప్రకాశ్ నోటి నుంచి హైదరాబాద్ అమ్రిష్ పురి అన్న మాట ప్రముఖంగా వినిపించింది. పలుమార్లు ఈ పదాన్ని ప్రయోగించిన ఆయన.. సదరు హైదరాబాద్ అమ్రిష్ పురి తన మిత్రుల మోజో టీవీ ఛానల్ ను కబ్జా చేసినట్లుగా ఆరోపించారు. రవిప్రకాశ్ ప్రస్తావించిన హైదరాబాద్ అమ్రిష్ పురి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీవీ9 ఎపిసోడ్ లో ప్రముఖంగా ఉన్న వారిని ఉద్దేశించే రవిప్రకాశ్ హైదరాబాద్ అమ్రిష్ పురి పేరును ప్రస్తావించి ఉంటారని చెబుతున్నారు. అయినా.. అప్పుడెప్పుడో విలనీ అయిన అమ్రిష్ పురి కాకుండా.. రీసెంట్ విలన్స్ ఎవరూ గుర్తుకు రాలేదా రవిప్రకాశ్!