Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కు అలాంటి గుర్తింపును ఇచ్చేసిన యునెస్కో

By:  Tupaki Desk   |   1 Nov 2019 4:40 AM GMT
హైదరాబాద్ కు అలాంటి గుర్తింపును ఇచ్చేసిన యునెస్కో
X
ప్రపంచంలో చాలానే నగరాలు ఉంటాయి. అయితే.. కొన్ని నగరాలకు ఉండే విలక్షణత మరే నగరానికి ఉండదు. అలాంటి ప్రత్యేకతల్ని గుర్తించేందుకు యునెస్కో ఇటీవల చేసిన ప్రయత్నంలో తాజాగా హైదరాబాద్.. ముంబయి నగరాలకు సరికొత్త గుర్తింపు లభించింది.

ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో క్రియేటివిటీ నగరాల జాబితాను మరోసారి సవరించింది. అక్టోబరు 31 సందర్భంగా ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా తాజాగా ఒక జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకూ ఉన్న నగరాలకు కొత్త తరహా ఇమేజ్ లు ఇస్తూ మరో 66 నగరాల్ని చేర్చారు. దీంతో.. ఇలాంటి ప్రత్యేక గుర్తింపు పొందిన నగరాల సంఖ్య 246కు పెరిగింది.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కు ఆహార ప్రియత్వం.. కల్చర్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గాస్ట్రానమీ కేంద్రంగా డెవలప్ అయ్యే నగరాల జాబితాలో ఆహారంతో ఉండే అనుబంధంగా హైదరాబాద్ ను పేర్కొంటే.. సినిమాలతో ముడిపడిన నగరంగా ముంబయిని పేర్కొంది.

సంగీతం.. లలిత కళలు.. జానపద కళలు.. సినిమా.. సాహిత్యం.. డిజిటల్ ఆర్ట్స్.. పాక నైపుణ్య కేంద్రంగా డెవలప్ అయ్యే నగరాలను క్రియేటివ్ సిటీస్ లిస్ట్ ను తయారుచేసింది. ఇందులోమన దేశానికి చెందిన ముంబయి.. హైదరాబాద్ లు చేరాయి. ఇక..హైదరాబాద్ విషయానికి వస్తే 800 ఏళ్ల క్రితం నాటి నుంచి ఆహారంతో ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ పేరు చెప్పినంతనే గుర్తుకు వచ్చే బిర్యానీ మొదలు.. హలీం.. ఇరానీ చాయ్.. సమోసా.. ఉస్మానియా బిస్కెట్.. పాయా శేర్వా.. ఖుబానీ కా మీఠా.. సులేమానీ.. లుక్మీ.. శ్రీఖండ్.. ఐస్ గోలా.. కుల్ఫీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తినుబండారాలు హైదరాబాద్ నగర జీవితంలో భాగమవుతాయని చెప్పక తప్పదు. ఆహార ప్రియులకు స్వర్గధామంగా చెప్పే భాగ్యనగరిలో సంప్రదాయంగా ఉండే ఆహారంతో పాటు.. కాలంతో పాటు వచ్చే కొంగొత్త మార్పులతో కొత్త తరహా ఫుడ్ కూడా లభిస్తుండటం హైదరాబాద్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు. అందుకే.. యునెస్కో సైతం హైదరాబాద్ ను ప్రత్యేకంగా గుర్తించిందని చెప్పక తప్పదు.