Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ యూటీ... టీఆర్ ఎస్ గ‌ర్జించింది

By:  Tupaki Desk   |   14 Aug 2019 5:08 PM GMT
హైద‌రాబాద్ యూటీ... టీఆర్ ఎస్ గ‌ర్జించింది
X
కేంద్రంలో తిరుగులేని వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోన్న అధికార బీజేపీ దేశ‌వ్యాప్తంగా కొన్ని ద‌శాబ్దాలుగా కొన‌సాగుతోన్న పాత చ‌ట్టాల‌కు పాత‌రేస్తోంది. ఇటీవ‌లే ట్రిఫుల్ త‌లాక్ బిల్లుకు చెక్ పెట్టేసింది. ఏడు ద‌శాబ్దాలుగా క‌శ్మీర్‌లో పెద్ద త‌ల‌నొప్పిగా ఉన్న ఆర్టిక‌ల్ 370వ నిబంధ‌న‌ను తొలగించింది. అక్క‌డితో ఆగ‌కుండా క‌శ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా మార్చేసింది. ఇక ఇప్పుడు జ‌మిలీ ఎన్నిక‌ల నినాదాన్ని బ‌లంగా త‌ల‌కెత్తుకుంది.

ఇవి ఇలా ఉంటే తెలంగాణలోనూ బీజేపీ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. ఇక్క‌డ మంచి దూకుడు మీదున్న సీఎం కేసీఆర్‌కు చెక్ పెట్టాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ ప్ర‌య‌త్నాల సంగ‌తి ఎలా ఉన్నా తెలంగాణ రాజ‌ధాని కేంద్ర‌పాలిత ప్రాంతంగా మార్చాల‌ని చూస్తోందని కొద్ది రోజులుగా పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. ముందుగా దేశ రెండో రాజ‌ధానిగా చేస్తార‌ని.. ఆ త‌ర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తార‌ని మ‌రోసారి వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వార్త‌లు ఇప్పుడు టీఆర్ఎస్ వ‌ర్గాల గుండెళ్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ తనను తాను బలోపేతం చేసుకునే విధంగా హైదరాబాద్‌ను భారతదేశ శాశ్వత రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తోంద‌న్న వార్త‌లు టీఆర్ఎస్ వాళ్ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చివ‌ర‌కు ఈ వార్త అటు మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ బాగా హ‌ల్‌చ‌ల్ చేస్తుండడంతో టీఆర్ఎస్ దీనిపై స్పందించ‌క‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గ్ర‌హించిన‌ట్లుంది. అందుకే ఈ వార్త‌పై కాస్త సీరియ‌స్‌గానే కౌంట‌ర్ ఇచ్చింది.

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ పుకారును నిరాధారమైందని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదనలు కూడా లేవ‌ని ఆయ‌న చెప్పారు. ఇదిలా ఉంటే జ‌మ్మ క‌శ్మీర్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ బిల్లుపై టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంటులో బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇక గ‌త రెండేళ్ల‌లో ద‌క్షిణ భార‌త‌దేశంలో హైద‌రాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రంగా ఉంది.

రాష్ట్రపతి శీతకాల విడిది హైదరాబాద్ లోని బొల్లారంలో ఉంది. ప్రతి శీతాకాలం ఇక్కడికి రాష్ట్రపతి వస్తుంటారు. రాష్ట్రపతి తన అధికారిక వ్య‌వ‌హారాలు నిర్వ‌హించ‌డాన‌కి ఇక్క‌డ అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయి. గతంలో అంబేద్కర్ కూడా పార్లమెంటు భవనం తప్ప దేశ రాజధాని కావడానికి హైదరాబాదుకు అన్ని అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అది కూడా ఇపుడు వైరల్ అవుతోంది. ఇక తాజాగా హైద‌రాబాద్ యూటీ అంటూ వ‌చ్చిన వార్త‌లు బాగా స్ప్రెడ్ అవుతుండ‌డంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చివ‌ర‌కు ఈ వార్త‌ల‌పై స్పందించ‌క‌ త‌ప్ప‌లేదు.