Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ... బీ కేర్ ఫుల్ !!
By: Tupaki Desk | 21 Jan 2022 4:47 AM GMTక్షేత్రస్థాయిలో ని పరిస్థితులు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా జ్వరాలు పెరిగిపోతున్నాయి. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్ళిన లక్షలాది మంది జనాలు తిరిగి రావడం మాత్రం జ్వరాలతో వచ్చారట. ఎందుకంటే ప్రభుత్వాసుపత్రుల్లో జ్వరాలతో వస్తున్న రోగుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల లెక్కల ప్రకారం నగరంలోని ప్రతి 100 మందిలో 20 మంది జ్వరాలతో బాధపడుతున్నారట.
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రెండు అంశాలు. మొదటిదేమో నగరంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు. రెండోదేమో పండగ కోసం తమ ఊర్లకు వెళ్ళిన వాళ్ళు కూడా వాతావరణంలో మార్పులకు అడ్జస్టు కాలేక తిరిగివచ్చే సమయానికే ఒంట్లో నలతగా ఉండటం. ఈ రెండు కారణాల వల్ల దగ్గు, జలుబు, జ్వరం రాగానే అనుమానంతో జనాలంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జనాల్లో ఎక్కువమందికి వస్తున్నది కేవలం జ్వరం మాత్రమే అని కరోనా వైరస్ కాదని డాక్టర్లు ధైర్యం చెబుతున్నారు.
అయితే ఇదే సమయంలో నగరంలో కరోనా వైరస్+ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా బాగా పెరిగిపోతోందట. గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్ లాంటి చోట్ల చాలామంది వైద్యులకు, వైద్య విద్యార్ధులకే కరోనా వైరస్ సోకింది. దాంతో హాస్టళ్ళనే అధికారులు మూసేశారు. కోవిడ్ రెండు టీకాలు వేయించుకున్నవారికి కూడా మళ్ళీ కరోనా వైరస్ సోకుతున్నది. అయితే టీకాలు వేయించుకోని వాళ్ళకు అయినట్లు అంత సీరియస్ గా ఉండటం లేదు. మొత్తం మీద టీకాలు వేసుకున్నా వేసుకోకపోయినా కరోనా వైరస్ అయితే సోకుతున్నది వాస్తవం.
పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల కారణంగా ఆసుపత్రులన్నీ బిజీ అయిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు సుమారు 4 వేల దాకా రికార్డయ్యాయి. వీరిలో 8 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 1500 కరోనా కేసులున్నాయి. కరోనా వైరస్ కేసుల నమోదు దామాషాతో పోల్చుకుంటే మరణాలు రేటు తక్కువే. కానీ కేసుల సంఖ్య మరింత పెరిగితే మరణాల రేటు కూడా పెరుగుతుందన్న విషయమే వైద్యాధికారుల్లో టెన్షన్ పెంచేస్తోంది. తాజాగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈయనే కాదు చాలామంది ఉన్నతాధికారులు, పోలీసులకు కూడా వైరస్ సోకటంతో హోం ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ సమస్య ఎప్పటికి తగ్గుతుందో ఏమో.