Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ కు చేదు వార్త‌

By:  Tupaki Desk   |   22 Dec 2015 3:02 PM GMT
హైద‌రాబాద్‌ కు చేదు వార్త‌
X
హైద‌రాబాద్‌ లో అత్యంత పాపుల‌ర్ ఏంటనే జాబితా తీస్తే ముందు చార్మినార్ ఆ త‌ర్వాత హుస్సేన్ సాగ‌ర్. వీటి త‌ర్వాత హైద‌రాబాద్ బిర్యానీ నిలుస్తుంది. దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన హైద‌రాబాదీ బిర్యానీకి ఉన్న క్రేజ్ మామూలేం కాదు. తాజాగా నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో బెయిల్ దొరికిన త‌ర్వాత కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ ప్ర‌త్యేకంగా ఢిల్లీలోని తెలంగాణ‌భ‌వ‌న్‌ కు వెళ్లి త‌న మేన‌ల్లుడితో క‌లిసి బిర్యానీ లాగించారు. ఇది హైద‌రాబాద్ బిర్యానీ స‌త్తా!

ఇలా ఎంతోమందికి ఫేవరెట్ డిష్‌ గా ఉన్న హైదరాబాద్ బిర్యానీకి చేదువార్త‌. హైద‌రాబాద్ బిర్యానీకి ఇప్పటివరకు జి.ఐ.ఆర్ (భౌగోళిక సూచీ నమోదు కేంద్రం) గుర్తింపు లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌ స‌భలో వెల్లడించారు. గుర్తింపు కోరుతూ 2009 జులై 28న దరఖాస్తు వ‌చ్చింద‌ని చెప్పారు. అయితే 2010 సెప్టెంబర్ 5, 2013 ఏప్రిల్ 28 తేదీల్లో జరిగిన దరఖాస్తును ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించిందని తెలిపారు. కానీ ప్రభుత్వం కోరిన ఇతర పత్రాలను దరఖాస్తుదారుడు ఇంకా సమర్పించలేదని పేర్కొన్నారు. దానివల్ల హైదరాబాద్ బిర్యానీకి జీఐఆర్ గుర్తింపు రాలేదని వివరించారు.

జీఐఆర్ గుర్తింపు ద‌క్కితే సద‌రు ఆహార ప‌దార్థాల‌కు ప్ర‌త్యేక గుర్తింపు దొరుకుతుంది. ఆయా ప్రాంతంలోనే పేటెంట్ ప్ర‌కారం అమ్ముకోవ‌డానికి వీలుంటుంది. అంతేకాకుండా జీఐఆర్ గుర్తింపు పొంది ఆయా కేట‌గిరీల్లో టాప్ రేటింగ్ ద‌క్కించుకోవ‌డం ద్వారా టూరిస్ట్‌లు త‌మ ఫేవ‌రేట్ డిష్‌గా ఎంపిక‌చేసుకునే అవ‌కాశం ద‌క్కుతుంది.