Begin typing your search above and press return to search.

సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో రేప్ అటెంప్ట్ చేసిందెవ‌రు?

By:  Tupaki Desk   |   17 March 2018 6:35 AM GMT
సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో రేప్ అటెంప్ట్ చేసిందెవ‌రు?
X
ప్ర‌తిష్ఠాత్మ‌క హైద‌రాబాద్ సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన విద్యార్థిపై అత్యాచార‌య‌త్నం చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. శుక్ర‌వారం రాత్రి ఈ షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

శుక్ర‌వారం రాత్రి వ‌ర్సిటీలోని నిర్మాష్య ప్రాంతంలో ఒక జంట కూర్చొని ఉండ‌గా ముసుగులు ధ‌రించిన ఆరుగురు యువ‌కుల బృందం ఒక విద్యార్థినిపై అత్యాచార య‌త్నానికి పాల్ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌తో షాక్ తిన్న స‌ద‌రు విద్యార్థిని వెంట‌నే స్పందించి.. తీవ్రంగా వ్య‌తిరేకించింద‌ని చెబుతున్నారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం వ‌ర్సిటీకి చెందిన జూనియ‌ర్ విద్యార్థుల్లోని ఒక జంట రాత్రివేళ హాస్ట‌ల్ భ‌వ‌నానికి దూరంగా ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్క‌డికి కొంద‌రు యువ‌కులు (మైన‌ర్లుగా చెబుతున్నారు) ముసుగు ధ‌రించి అక్క‌డ‌కు చేరుకున్నారు. జంట‌ను భ‌య‌భ్రాంతులు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. వారు తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌టంతో పాటు పెద్ద‌గా కేక‌లు వేయ‌టంతో బెదిరిపోయిన వారు పారిపోయారు. వెంట‌నే అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జంట‌.. త‌మ‌కు ఎదురైన ప‌రిస్థితి గురించి భ‌ద్ర‌తా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌టం.. పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన పోలీసు బృందం వ‌ర్సిటీ ప్రాంగ‌ణాన్ని త‌నిఖీ చేశారు.

ఒక వాద‌న ప్రకారం ఇద్ద‌రు కుర్రాళ్లు దొరికార‌ని.. వారి సాయంతో మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తం ఆరుగురుయువ‌కుల్ని శ‌నివారం తెల్ల‌వారుజామున పోలీసులు ప‌ట్టుకున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిలో ఎక్కువ‌మంది మైన‌ర్లుగా భావిస్తున్నారు. త‌మ‌పై దాడికి య‌త్నించిన వారిని గుర్తించేందుకు బాధిత జంట‌ను పోలీసులు గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళుతున్న‌ట్లుగా చెబుతున్నారు. వ‌ర్సిటీ చ‌రిత్ర‌లో ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోలేద‌ని.. ఇదే తొలిసారిగా చెబుతున్నారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉండే వ‌ర్సిటీలోకి అప‌రిచితులు ఎలా వ‌చ్చి ఉంటార‌న్న విష‌యంపై భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

కిందిస్థాయి ఉద్యోగుల పిల్ల‌లు.. త‌మ త‌ల్లిదండ్రుల కోసం వ‌చ్చిన‌ట్లుగా లోప‌ల‌కు వ‌చ్చి ఇలాంటి ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతుండ‌గా.. వ‌ర్సిటీ గోడ‌ను దూకిన కొంద‌రు ఆక‌తాయులు ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. పోలీసుల విచార‌ణ‌లో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.