Begin typing your search above and press return to search.
బ్యూటీషియన్ శిరీష కుమార్తెను చదివిస్తానన్నారు
By: Tupaki Desk | 10 July 2017 5:04 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ ఆత్మహత్య ఉదంతం ఇప్పటికి కొన్ని సందేహాల్ని వ్యక్తమయ్యేలా చేస్తోంది. ఈ ఎపిసోడ్ లో శిరీష కుమార్తె భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. తల్లిని పోగొట్టుకొని తీవ్ర మనోవేదనకు గురయ్యే ఆ చిన్నారికి అండగా నిలిచే వారు ఎవరు?
చిన్న వయసులో ఆ చిన్నారికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి ఆ పాపపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న సందేహాం తలెత్తే పరిస్థితి. శిరీష కుమార్తె దివ్యకు అనూహ్యంగా ఒక అపన్న హస్తం తోడుగా నిలవనుంది. ఆమె చదువుల కోసం అవసరమయ్యే ఫీజుల్ని తాను భరించనున్నట్లుగా సీఐడీ ఐజీ పి.వి. సునీల్ కుమార్ వెల్లడించారు.
శిరీష ఉదంతం తనను కలిచివేసిందని.. తనను ప్రభావితం చేసిన ఈ ఉదంతానికి సంబంధించి శిరీష కుమార్తెకు డిగ్రీ వరకూ అయ్యే కళాశాల ఫీజుల్ని తాను చెల్లించనున్నట్లుగా ఆయన చెప్పారు. శిరీష కుమార్తె ప్రస్తుతం నానమ్మ.. తాతయ్యల వద్ద ఉంది. పాలకొల్లులో ఎనిమిదో క్లాస్ చదువుతున్న ఆమెకు తాను అండగా ఉండనున్నట్లుగా వెల్లడించారు. ఒక సంచలన కేసులో బాధితురాలి ఫ్యామిలీ మెంబర్ కు ఒక పోలీసు ఉన్నతాధికారి అండగా నిలవటం ఆసక్తికర అంశమని చెప్పక తప్పదు.