Begin typing your search above and press return to search.
ఆ గలీజ్ సీఐను డిస్మిస్ చేసి పారేసిన హైదరాబాద్ కమిషనర్
By: Tupaki Desk | 11 Oct 2022 4:52 AM GMTదాదాపు మూడు నెలల క్రితం హైదరాబాద్ మహానగర శివారులోని వనస్థలిపురంలోని ఒక ఇంట్లోకి ప్రవేశించిన మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు.. తన సర్వీసు రివాల్వర్ తో బెదిరించి ఆ ఇంట్లోని మహిళపై అత్యాచారానికి పాల్పడిన వైనం తెలిసిందే. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఉద్యోగంలో ఉంటూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ..
పోలీసు వ్యవస్థ సిగ్గు పడేలా అతడి మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. బాధితురాలి మీద అత్యాచారం చేసిన వేళలో అక్కడికి వచ్చిన భర్తను సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి.. ఇద్దరినీ కిడ్నాప్ చేయటం.. ఆ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురి కావటం తెలిసిందే.
అనూహ్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఉదంతంలో బాధితులు ప్రాణభయంతో తప్పించుకొని చివరకు వనస్థలిపురం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం.. మీడియాలో పెద్ద ఎత్తున బయటకు రావటంతో ఇదో సంచలనంగా మారింది. తీవ్రమైన ఆరోపణల వేళ.. సీఐ నాగేశ్వరరావును సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు విచారించగా.. విచారణలో తాను చేసిన తప్పును ఒప్పుకున్నారు.
తాజాగా అతడిని సర్వీసుల నుంచి డిస్మిస్ చేస్తూ హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగేశ్వరరావును సర్వీసు డిస్మిస్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది ఈ చర్యతో తప్పులు చేసే అధికారులకు షాకిచ్చినట్లుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.