Begin typing your search above and press return to search.
భారత్ బయోటెక్ మరో కీలక ముందడుగు ...జూలైలో మనుషులపై ట్రయల్స్ !
By: Tupaki Desk | 30 Jun 2020 10:30 AM ISTగత ఏడు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ మహమ్మారి నియంత్రణ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ మరో కీలక ముందడుగు వేసింది. మహమ్మారి కట్టడికి ఈ సంస్థ తయారు చేస్తున్న కో వ్యాక్సిన్ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. మానవులపై ‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్ ట్రయల్ జూలై లో ప్రారంభమవుతుంది. తర్వాత ఈ వ్యాక్సిన్ ను స్వీకరించడానికి నిర్ణయం తీసుకోబడుతుంది.
వైరస్ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, ఎన్‌ఐవీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. జులై నెల నుంచి మానవులపై ప్రయోగాలు చేయనుంది. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ‘కో వ్యాక్సిన్’ తయారీ చరిత్రాత్మకం అవుతుందన్నారు.
వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకున్న కొన్నింటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. హైదరాబాద్ లోని జివోమ్ వ్యాలీలో బయోసేఫ్టీ లెవల్-త్రీ తో కలిసి కో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. జూలైలో మానవ ప్రయోగాలు మొదలైనందున ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే కరోనా చికిత్స కోసం గ్లెన్ మార్క్ ఫాబిఫ్లూ తో పాటు మరో దేశీయ ఔషధ సంస్థ హెటిరో కోవిఫర్ ఔషధాలకు డీసీజీఐ అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. వీరో సెల్ కల్చర్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీస్ ను ఆవిష్కరించటంలో భారత్ బయోటెక్ కు ఎంతో అనుభవం ఉంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటి వరకూ పోలియో, రేబిస్, రొటావైరస్, జేఈ , చికున్ గున్యా, జికా టీకాలను ఆవిష్కరించారు.