Begin typing your search above and press return to search.
భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలపై కేటీఆర్ ప్రశంసలు
By: Tupaki Desk | 3 Jan 2021 11:38 AM GMTదేశానికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ కృషిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తాజాగా ఈ భారత్ బయోటెక్ పై మంత్రి కేటీఆర్ . టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని మంత్రి కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్ భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కంపెనీ ఎండీ కృష్ణ ఎల్ల - జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రతిభావంతమైన శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తల కారణంగా వ్యాక్సిన్ రాజధాని నగరం ప్రసిద్ధి చెందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. వీరి కృషితో హైదరాబాద్ కు ఎంతో ఖ్యాతి లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా టీకా కోసం కృషి చేసిన కంపెనీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
భారత ప్రభుత్వం ఐసీఎంఆర్, ఫూణే ఎన్ఐవీ సహకారంతో భారత్ బయోటెక్ ఈ కరోనా వ్యాక్సిన్ ను రూపొందించింది. ఇది ఇండియాలోనే తయారైన స్వదేశీ టీకా. తాజా అనుమతులతో భారత ప్రజలకు టీకా అందుబాటులోకి వచ్చినట్లైంది.