Begin typing your search above and press return to search.
శభాష్.. హైదరాబాద్ పోలీస్!
By: Tupaki Desk | 1 March 2018 4:30 AM GMTనోరు తెరిస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఉదరగొట్టేస్తారే తప్పించి.. చేతల్లో చేసి చూపించరే అంటూ హైదరాబాద్ పోలీసుల మీద పలువురు విమర్శలు చేస్తుంటారు. తాజాగా.. తమది అసలుసిసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు హైదరాబాద్ పోలీసులు. పోలీసులు చేసిన పని ఇప్పుడు అందరి మన్ననలు అందుకోవటమే కాదు.. శభాష్ అనేలా చేస్తోంది. ఇంతకూ జరిగిందేమంటే..
హైదరాబాద్ లోని మారేడు పల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ఎగ్జామ్స్ రాసేందుకు ఎనిమిది మంది విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. అనుకోని రీతిలో బస్సు ఆగిపోయింది. ఎగ్జామ్ కు ఒక నిమిషం ఆలస్యంగా వెళ్లినా.. పరీక్ష హాల్లోకి అనుమతించమన్న అధికారుల రూల్ గుర్తుకు వచ్చి విద్యార్థులు హడలిపోయారు.
తమనీ కష్టం నుంచి ఎలా గట్టెక్కించే వారెవరూ అంటూ దిక్కులు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అదే రూట్ లో వెళుతున్న మారేడుపల్లి సీఐ శ్రీనివాసులకు విద్యార్థుల అవస్థ గురించి తెలిసిందే. వెంటనే స్పందించిన ఆయన తన ఇన్నోవా వాహనంలో ఎనిమిది మంది విద్యార్థుల్ని ఎక్కించుకున్నారు.
నేరుగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. దీంతో.. వారుసకాలంలో ఎగ్జామ్ హాల్ కు చేరుకోగలిగారు. పరీక్షలు రాశారు. సీఐ చొరవను పలువురు ప్రశంసించటంతో పాటు.. అసలుసిసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనని పలువురు ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో సీఐ చేసిన పనిని పలువురు కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు.